Intinti Gruhalakshmi 30 Sep Today Episode : సామ్రాట్ కాళ్లు పట్టుకుంటా అంటున్న అనసూయ.. తులసి పై కోప్పడుతున్న సామ్రాట్…!

Advertisement

Intinti Gruhalakshmi 30 Sep Today Episode : బిల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి .ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 751 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఆఫీస్ రూమ్ లో తులసిని చూసి లాస్య కుళ్లుకుంటూ నందుకి చెప్తూ ఉంటుంది. అప్పుడు నందు సామ్రాట్ గారు ఏరి కోరి తులసిని ఆ సీట్లో కూర్చోబెట్టారు. కాబట్టి మనం తలవంచాలి అని చెప్తాడు. ఇక లాస్య తులసీని పడేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అంతలో తులసి వచ్చి నాకు లంచ్ టైం కల్లా ఫైల్ కావాలి అని ఆర్డర్ వేసి పోతుంది. ఇక అప్పుడు నందు, తులసి ఏం చెప్పిందో విన్నావు కదా. పరువు పోకుండా చూసుకో అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లాస్య మండిపోతు తులసిని ఏదో ఒకటి చేయాలి అని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ప్రేమ్ శృతి సరదాగా కొద్దిసేపు గొడవపడతారు. ఇక కట్ చేస్తే అనసూయ బయట వాళ్ళ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ తులసి నీ తిట్టుకుంటూ ఉంటుంది. అంతలో అభి వచ్చి మామ్ ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదు.. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకోవాలి నువ్వే ఆలోచించు మళ్ళీ పాత అనసూయ నీ చూడాలి అని ఇంకాస్త రెచ్చగొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అనసూయ గట్టిగా ప్లాన్ వేసుకుంటుంది. కట్ చేస్తే తులసి సామ్రాట్ కి ఫోన్ చేసి అర్జెంటు మీటింగ్ ఉంది. సామ్రాట్ గారు అని గుర్తు చేస్తూ ఉంటుంది.

Advertisement

సరదాగా మాట్లాడుకుంటూ నాక్కూడా ప్రసాదం తీసుకురండి అని చెప్తూ ఉంటుంది. ఇక సామ్రాట్ తెగ సంతోష పడుతూ ఉంటాడు. అంతలో సామ్రాట్ బాబాయ్ అక్కడికి వచ్చి ఈ సంతోషానికి కారణమేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జస్ట్ అలా హ్యాపీగా ఉండాలనిపించింది హ్యాపీగా ఉన్నాను అని అంటాడు. కానీ సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నీ సంతోషానికి కారణం ఏంటో అంత నాకు తెలుసు అని అంటాడు. ఇక తర్వాత హాని స్కూల్ కి వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ సామ్రాట్ హనీ ని కన్విన్స్ చేసి పంపిస్తాడు. ఇక అంతలో సామ్రాట్ దగ్గరికి అనసూయ వస్తుంది. అప్పుడు సామ్రాట్ అమ్మ ఒక్కల్లే వచ్చారా అని అడుగుతూ ఉండగా… తులసి లేకుండా మీ ఇంటికి వచ్చే అర్హత లేదా అని అనసూయ అంటుంది. అప్పుడు సామ్రాట్ అదేం లేదమ్మా ఎప్పుడైనా రావచ్చు ఇది కూడా మీ ఇల్లే అని అంటూ ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం రండి అని అనసూయని పిలుస్తాడు. అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత అనసూయ ఇక తులసి మీ ఆఫీసు మొహం చూడవద్దు.. జాబ్ మానేయాలి అని సామ్రాట్ నీ బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ మీరు తులసి గారికి అన్యాయం చేస్తున్నారు. ఈ విషయం తులసి గారికి తెలుసా.. ఎందుకిలా మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు. తనకి తెలీదు తనకు తెలిస్తే నేను మీ దాకా ఎందుకు వస్తాను అని అంటూ ఉంటుంది.

Advertisement
intinti gruhalakshmi 30 september 2022 full episode
intinti gruhalakshmi 30 september 2022 full episode

అప్పుడు సామ్రాట్ ఇంతలా ఎన్ని పోటు పొడవడం అస్సలు బాగాలేదు.. నిన్ననే కదమ్మా ప్రెస్మీట్లో తులసి గారు చాలా ధైర్యంగా మాట్లాడి ఎవరేమనుకున్నా మా పార్ట్నర్షిప్ వదులుకోను అని చెప్పగానే మీరు కూడా సప్పట్లు కొట్టారు అని అంటాడు. అప్పుడు నిన్ను ఏదో పొరపాటు చేశాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను నీకు తెలియదు బాబు నలుగురు నోట్లోనానడంట మాకు ఇష్టం లేదు. బయట జనాలు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. మాది పరువు కల కుటుంబం ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేము నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను అని ఏడుస్తూ ఇక తులసిని ఆఫీస్ మోహం చూడకుండా చెయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సామ్రాట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ప్రేమ్ ఆడిషన్స్ కోసం వస్తాడు. అప్పుడు అక్కడ ప్రేమ్ సెలెక్ట్ అవుతాడు. ఇక ప్రేమ్ సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. కానీ అక్కడ ఒక అతను ప్రేమ్ కి అడ్డుపడుతూ టాలెంట్ నాది కానీ నువ్వు రికమండేషన్స్ తో సెలెక్ట్ అయ్యావు అని అంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో తులిసి ని ఆఫీస్ కి రాకుండా చేయాలని కావాలనే సామ్రాట్ తులసిని తిడుతూ ఉంటాడు. తులసి బాధపడుతూ ఉంటుంది. ఇక నందు లాస్య సంతోషంలో తేలిపోతుంటారు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే..

Advertisement