Intinti Gruhalakshmi : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 765 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… తులసి ఇద్దరు కొడుకులు ఫస్ట్ నైట్ కి సిద్ధం చేసి వాళ్ల వాళ్ల రూమ్‌లోకి వాళ్ళని పంపిస్తుంది. అలా పంపించిన అభి, ప్రేమ్ వాళ్ళ భార్యలతో సంతోషంగా మాట్లాడుతూ గడుపుతూ ఒక్కటైపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు సిగ్గుపడుతూ అంకిత, శృతి తులసి ముందుకి వస్తారు. ఇక తులసి కూడా సిగ్గుపడుతూ వెళ్లి స్నానం చేసి వచ్చి పూజ చేయండి అని చెప్తుంది. తర్వాత ప్రేమ్ అభి లు కూడా సిగ్గుపడుతూ వాళ్ళ తాతయ్య నాయనమ్మల ముందుకు వస్తారు. అప్పుడు పద్మనాభం కొద్దిసేపు వాళ్ళిద్దర్నీ ఆటపటిస్తాడు. తర్వాత తులసి టిఫిన్ కి సిద్ధం చేశాను అందరూ రండి టిఫిన్ చేయద్దురుగాని అని చెప్తూ ఉంటుంది. అలా అందరూ సంతోషంగా టిఫిన్ చేస్తారు.
తర్వాత తులసి ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో లాస్య అనసూయ కి ఫోన్ చేసి నీ కొడుకు జాబ్ మానేశాడు.. నీ కోడలు సామ్రాట్‌ని రెచ్చగొట్టి నందుని నానా మాటలు అనేలా చేసింది. దానికి ఆయన బాధపడి జాబ్ మానేశాడు తన కాళ్ల భేరానికి రావాలని చూస్తుంది తులసి అని లేనిపోనివన్నీ తులసి పై చెప్పి అనసూయని బుట్టలో పడేస్తుంది. అప్పుడు అనసూయ ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పలేదు ఆ తులసి అని తనపై మండిపడుతూ ఉంటుంది. అంతలో తులసి వచ్చి అత్తయ్య గారు ఎక్కడున్నారు అని అడుగుతుంటే. నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తున్నావ్ తులసి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నందుని నువ్వు ఏమన్నావు వాడు ఇప్పుడు జాబ్ మానేసాడంట అని నందుని పొగుడుతూ తులసిని తిడుతూ ఉంటుంది.

అంతలో సామ్రాట్ అక్కడికి వచ్చి అనసూయ కి జరిగిందంతా చెప్పి దీనిలో తులసి గారు తప్పేం లేదు తులసి గారిని నానా మాటలు అన్నారు. అని చెప్పి అనసూయ కి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. కానీ అనసూయ అసలు వినిపించుకోకుండా ఉంటుంది. మీరు ఏమైనా నా మాటలు వింటున్నారా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అని తులసి పై మండిపడుతూ ఉంటుంది. కాని సామ్రాట్ తనకి నచ్చినట్టు ఉంటాడు. అప్పుడు అందరూ అక్కడికి వచ్చి తులసిని పొగుడుతూ ఉంటారు కానీ అనసూయ తులసిని బయట వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు మీకు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే సామ్రాట్ తులసి గారు అంత ధైర్యంగా అంత ధైర్యం చెప్పిన మీరు ఇంకా ఎందుకు మారట్లేదు అని మీరెందుకు అంత భయపడుతున్నారు అనసూయ గారు అని అంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…