Manchu Lakshmi: మోహన్ బాబు ( mohan babu ) నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా పలు రంగాలలో అద్భుతమైన ప్రతిభ చాటింది. ఈ అమ్మడు ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన చాలా విషయాల్ని ఆమె.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. యూట్యూబ్ వేదికగా తరచూ హోంటూర్స్, ఇంట్లో సెలబ్రెషన్స్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా తరచూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
మంచు లక్ష్మీ తన కూతురికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. మంచు లక్ష్మికి ఒకత్తే కూతురు. తనే విద్యా నిర్వాణ. విద్యా పుట్టినప్పటి నుండి తన గురించి నెటిజన్లకు తెలిసేలా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది మంచు లక్ష్మి. అంతే కాకుండా తన కూతురు పాటలు పాడినా, డ్యాన్స్ చేసినా.. వెంటనే వాటిని వీడియోలు తీసి అందరితో షేర్ చేసుకుంటుంది. ఇక వీరి బాండింగ్ చూస్తుంటే.. తల్లీకూతుళ్లలాగా కాకుండా ఫ్రెండ్స్‌లాగా ఉంటారు అనుకుంటూ ఉంటారు కొందరు నెటిజన్లు. సరోగసీ ద్వారా కూతురికి మంచు లక్ష్మీ జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Manchu Lakshmi : భలే మిస్ అయిందే..
అయితే మంచు లక్ష్మీ పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అప్పట్లో తన కుమార్తెను టాలీవుడ్ లో టాప్ హీరో గా ఉన్న ఆ స్టార్ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట మోహన్ బాబు . ఆయన మంచు ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని దగ్గర బంధువు అని కూడా సమాచారం. అయితే మంచు లక్ష్మీకి ఆ సమయంలో పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ పెళ్లి వద్దని చెప్పిందట. విదేశాలకి వెళ్లి చదువుకుంటానని చెప్పిన మంచు లక్ష్మీ పెళ్లి విషయంలో నో అని ఖరాఖండీగా చెప్పింది. అలా పెళ్లి క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ ఆహా వారితో ఒక ఓ క్రేజీ కుకింగ్ షోను హోస్ట్ చేస్తుంది. భర్త, ఓ పాప తో చాలా హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.