Puri Jagannadh : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా లైగర్ . ఈ సినిమా విడుదల కాకముందు దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ విడుదల తర్వాత ఈ సినిమా చిత్ర బృందానికి పెద్ద షాక్ ను ఇచ్చింది . భారీ అంచనాలతో విడుదలై అయిన ఈ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాను నేటి జనులు దారుణంగా ట్రోల్ చేశారు.ఇక ఈ ట్రోలింగ్స్ నుండి బయట పడేందుకు పూరి ప్రయత్నిస్తుండగా మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయట. లైగర్ సినిమాలో భాగస్వాములైన బయ్యర్లు, ఎగ్జిక్యూటర్లు భారీగా నష్టపోవడంతో, దర్శకుడు పూరి జగన్నాథ్ వీరికి సాధ్యమైనంత వరకు సెటిల్ చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
కానీ ఇంతవరకు తను ఇచ్చిన మాటను ,నిలబెట్టుకోకపోవడంతో బయ్యర్లు మరియు ఎగ్జిక్యూటర్లు, పూరిపై ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించడం విశేషం. రాంగోపాల్ వర్మ జగన్నాథ్ కు సన్నిహితుడు. అలాంటి రాంగోపాల్ వర్మ ,పూరిపై ధర్నాకు దిగడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు.భారీగా నష్టపోవడంతో పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కూడా ఆర్థిక సమస్యల లో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పూరి జగన్నాథ్ ముంబైలోని తన ఇల్లును కూడా కాలి చేసినట్లుగా తెలుస్తుంది. ఇలా జరగడానికి గల ముఖ్య కారణం ,చార్మి నోరు జారడం అని తెలుస్తుంది.

అయితే చార్మి ఒక పార్టీలో సినిమా గురించి ఒక షాకింగ్ వార్తను రివిల్ చేసింది. లైగర్ సినిమా వల్ల మాకు ఏమీ నష్టాలు రాలేదని, అటు ఇటుగా తమకి కొన్ని కోట్లు లాభం వచ్చిందని చెప్పిందట. ఇక ఈ మాట విన్న ఎగ్జిక్యూటర్స్ , బయ్యర్స్ పూరి పై మరింత ఒత్తిడిని తీసుకొస్తున్నారు. అందుకే బయ్యర్స్ ఎగ్జిక్యూటర్స్ పూరి జగన్నాథ్ పై ధర్న కు దిగినట్లుగా తెలుస్తుంది. పూరి జగన్నాథ్ ఇంతకుముందు ఒకసారి ఎదుర్కొన్న సమస్యలను మరలా ఎదురుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఛార్మి అలా నోరు జారకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదేమో.