Jabardasth Faima : ఫైమా..ఈ పేరు బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది . తన కామెడీ టైమింగ్.. పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఫైమా అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నిరుపేద కుటుంబం నుంచి ఓ సామాన్య అమ్మాయి జబర్ధస్త్, బిగ్‌బాస్ షో వరకు రావడం వెనక అంతులేని కష్టాలు.. ఎన్నో అవమానాలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో బాగానే సందడి చేస్తూ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.
ఇక మరోసారి రాజ్.. ఫైమా మధ్యలో కామెడీ ట్రాక్ నడిచింది. ఫైమా ఇలా రండి అంటే సరిపోతుంది కదా అలాంటిది పక్కకి రా అంటూ ఇలా చేతితో అనడం ఏమిటి అని ఫైమా రానిని ఇమిటేట్ చేసింది. అంతేకాకుండా చూసేవాళ్ళు నీకు నాకు ఏమైనా ఉంది అని అనుకుంటే ఏంటి పరిస్థితి అని ఫైమా మాట్లాడిన విధానం అక్కడ కామెడీ ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా నేను నా గోల్ కోసం వచ్చాను అంటూ పంచ్ వేసింది. ఇక పక్కనే ఉన్న చలాకి చంటి కూడా వీరిద్దరి కామెడీ పై తనదైన శైలిలో పంచ్ వేశాడు. ఎక్కడైనా వెళుతుంటే పక్కనుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఓకే అనుకోవచ్చు. కానీ అదే బ్యాడ్ స్మెల్ కారులో 25 కిలోమీటర్లు ట్రావెల్ అయితే ఎలా ఉంటుంది నువ్వు ఉండగలవా అని ప్రశ్నిస్తూ అంతా నీచమైన పంచ్ నీది అని రాజ్ పై సెటైర్ వేశాడు.

Jabardasth Faima : ఫైమా రచ్చ..
ఇక శుక్రవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో కెప్టెన్ అనే ఆంగ్ల అక్షరాలని ఒక్కొక్కటి తీసుకువచ్చి హుక్స్ కి తగిలించాలి. అక్షరాలని తీసుకుని వెళ్లేసమయంలో బిగ్ బాస్ ఇచ్చిన ప్యాడ్స్ పైనే నడవాలి. అందరికంటే వేగంగా టాస్క్ ని పూర్తి చేస్తారో వారు విజయం సాధించినట్టే అని బిగ్ బాస్ చెప్పగా, అద్భుతంగా ఆడి కీర్తి విజయం సాధిస్తుంది. బిగ్ బాస్ 6 కొత్త కెప్టెన్ గా అవతరిస్తుంది. దీనితో బిగ్ బాస్ కీర్తిని అభినందించి ఆమెకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు. ఇక అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య కోసమే ఆడుతున్నాడు అంటూ కొందరు ఆరోపిస్తారు. దీనితో బిగ్ బాస్ అతడిని జైల్లో పెట్టాలని.. తదుపరి ఆదేశాల వరకు జైల్లోనే ఉండాలని కెప్టెన్ కీర్తిని ఆదేశించారు.