Jabardasth Faima : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సీజన్ 6 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 21 మంది సభ్యులు ఈ సీజన్‌లో అడుగుపెట్టగా,ఇందులో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. షానీ, అభినయశ్రీ హౌజ్ నుండి ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌజ్ లో 19 మంది ఉన్నారు. ఎవరికి నచ్చినట్టు వారు తమదైన శైలిలో గేమ్ ఆడుతున్నారు. అయితే ఈ కంటెస్టెంట్స్‌కి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జబర్ధస్త్ వేదికపై తన పర్‌ఫార్మెన్స్‌తో రక్తి కట్టించిన ఫైమా ఇప్పుడు బిగ్ బాస్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.
ఫైమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదించుకుంది. అది బిగ్ బాస్ హౌస్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫైమా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెకు వారాని రెండున్నార లక్షల రెమ్యూనరేషన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆటతీరునుబట్టి చూస్తే.. ఫైమా చివరి వరకూ గట్టిగానే నెట్టుకొచ్చేలా కనిపిస్తుంది. లేడీ కమెడియన్ కావడం, పంచులు ప్రాసలు గట్టిగా వేయడం,ఆటతీరు కూడా బాగానే ఉండటం ఫైమాకి కలిసొచ్చే అంశాలు. పైగా పేద కుటుంబం నుంచి రావడం కూడా ఆమెకు చాలానే ప్లస్ అయింది.

Jabardasth Faima : భారీ డిమాండ్…
ఫైమా కల సొంతిల్లు కొనుక్కోవాలని. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు తీసకుంటానంటోంది ఫైమా. ఈ విషయం స్టేజ్ పైనే చెప్పింది లేడీ కమెడియన్స్. ఇక ఫైమా జబర్థస్త్ రెమ్యూనరేషన్ పై డిఫరెంట్ గా స్పందించింది ఆమె తల్లి. ఆడపిల్లని సంపాదన గురించి అడగలేం , అదే.. మగ పిల్లాడైతే, నువ్వెంత సంపాదిస్తున్నావ్ రా.. అని గట్టిగా అడగగలం.. ఆడపిల్లని అలా అడగలేం. పైగా, కుటుంబ పోషణ బాధ్యత అంతా నా కూతురు ఫైమానే చూసుకుంటుంది.తోడబుట్టినవాళ్ళనీ చూసుకుంటుంది.. అలాంటిప్పుడు ఎలా అడగగలం అని ఫైమా తల్లి చెప్పుకొచ్చింది. కొడుకులా బాధ్యతలన్నీ బుజాన మోస్తున్న తన కూతురు.. బిగ్ బాస్ విన్నర్ ఖచ్చితంగా అవుతుందంటూ.. ఫైమా తల్లి ధీమా వ్యక్తం చేసింది.