Jabardasth : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ షో ఒకప్పుడు సక్సెస్ ఫుల్‌గా నడిచేది. కాని ఇటీవల ఈ షో వివాదాస్పదంగా మారుతుంది. రేటింగ్ లో కూడా అట్టడుగుకు చేరింది. అందుకు కారణం ఈ కమెడియన్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తంగా టాలెంట్ ఉన్న కమెడియన్లను ఆ నటుడు పక్కన బెట్టేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. జబర్దస్త్ లోనే కాకుండా ఇతర ఈవెంట్లు, కార్యక్రమాల్లో జబర్దస్త్ నటులు వెళితే.. అక్కడ కూడా వారికి అవకాశం రానివ్వకుండా అడ్డుకుంటున్నాడట.అతగాడు జబర్దస్త్ లోనే కాకుండా ఇతర చానెళ్లలోనూ కనిపిస్తూ ఇతరులను వంచిస్తున్నట్లు బుల్లితెర ఇండస్ట్రీ కోడై కూస్తోంది.
ఇదిలా ఉండగా కొన్ని మిగతా చానెళ్లతో జబర్దస్త్ రేటింగ్ డౌన్ అయ్యేలా చేయాలన్న సీక్రెట్ ఒప్పందాన్ని కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ ప్రొగ్రాం ఎందరి జీవితాలనో నిలబెట్టింది. ఇప్పుడు సినిమాల్లో మంచి పొజిషన్లో ఉన్నవారిలో కొందరు జబర్దస్త్ లో నటించిన వాళ్లే. అయితే సినిమాల్లో బిజీగా మారడంతో పాటు ఇతర కారణాలతో దాదాపు మొదటి నుంచి ఉన్నవారంతా బయటకి వచ్చారు.. బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న ఎంటర్టైన్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈటీవీ, మల్లెమాల వంటి షోలు అయితే జనాలు తిడుతూనే చూస్తుంటారు. జబర్దస్త్ షోలో ఎంత వల్గారిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. అడల్డ్ కంటెంట్ కామెడీతో టీఆర్పీల్లో దూసుకుపోతుంటుంది.

Jabardasth : ఆయన వల్లేనా..
అయితే కొన్ని సార్లు కామెడీ హద్దులు దాటుతుండటంతో వివాదాలు సైతం చుట్టు ముడుతుంటాయి. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లను సైతం కొంత మంది ప్రైవేట్‌గా చుట్టి ముట్టి కొట్టిన ఘటనలు కూడా వచ్చాయి. కుల సంఘాలు సైతం జబర్దస్త్ షో మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అనేక కారణాల వలన కంటెస్టెంట్లు, టీం లీడర్లు, జడ్జ్‌లు మారుతూనే వస్తున్నారు. జబర్దస్త్ నుంచి టాప్ సెలెబ్రిటీలంతా కూడా పోతూనే ఉన్నారు. నాగబాబు బయటకు వెళ్లినప్పటి నుంచి జబర్దస్త్ షోలో చాలా మార్పులు వచ్చాయి. చమ్మక్ చంద్ర వంటి వాళ్లు వెళ్లిపోయారు. ఆ తరువాత అదిరే అభి వెళ్లిపోయాడు. ఈ మధ్య సుధీర్, అనసూయ కూడా బయటకు వచ్చేశారు. ఆది కూడా కొన్ని రోజులు జబర్దస్త్‌కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఈ మధ్య ఆది వెనక్కి వచ్చేశాడు.