Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఈయన హీరోగాను ప్రేక్షకులని అలరించాడు. ఇక టీవీలో వచ్చే డ్యాన్స్ షోలలోను అప్పుడప్పుడు కనిపించి సందడి చేస్తుంటాడు. చాలా కష్టపడుతూ ఈ స్థాయికి చేరుకున్న జానీ మాస్టర్ తనకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. జీ తెలుగులో ప్రసారమైన ఓ షోలో జానీ మాస్టర్ అనసూయతో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు . ఏకంగా తన చీర కొంగును నోట్లో పెట్టుకొని మరి స్టెప్స్ వేసి కుర్రాళ్లకు మత్తెక్కించాడు. అంతలా స్పాంటేనియస్ గా కొరియోగ్రఫీ చేయడంలో జానీ మాస్టర్ ధిట్ట.
ఈ మధ్యనే ఆయన కొరియోగ్రఫీ చేసిన బీస్ట్ సినిమాలోని హైలెట్ గా మారిన “అరబిక్ కుతూ” సాంగ్.. ఆ తర్వాత “రక్కమ్మ” సాంగ్ ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. 2003లో ద్రోణ మూవీ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ అందుకున్న జానీ మాస్టర్ ఆతర్వాత 2012లో రచ్చ సినిమాకి కొరియోగ్రఫీ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారికి కూడా కొరియోగ్రఫీ చేశాడు. 2014లో సల్మాన్ ఖాన్ నటించిన జయహో సినిమాకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు. ఇస్మర్ట్ శంకర్ టైటిల్ సాంగ్, అల వైకుంఠ పురం సినిమాలో బుట్ట బొమ్మ పాట తో కూడా క్లాస్ స్టెప్పులు వేయించారు జానీ మాస్టర్.

Jani Master : బాగానే సంపాదించాడు..
ఆయన కొరియోగ్రఫీ చేసిన చాలా పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక జానీ మాస్టర్ ఎంత వరకు సంపాదించాడు అనేది చూస్తే ఆయన భార్య డెలివరీ కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. బిల్లు 5లక్షల వరు అయిందట. అయితే ఈ విషయం రామ్ చరణ్ కి తెలియడంతో ఆయనే బిల్ పే చేశారని ,అది కూడా తనకు తెలియకుండా. జానీ మాస్టర్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒక్కో సినిమాకి రెమ్యూనరేషన్ 20 నుంచి 30 లక్షల వరకు తీసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ అయితే 10 లక్షల వరకు తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి ఆయన ఆస్తులు బాగానే సంపాదించారని హైదరాబాద్ బెంగళూరు లో దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈయన గ్రాఫ్ బాగానే ఉంది.