Vijay Deverakonda – Rashmika : జాన్వి కపూర్ శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్లో మంచి మంచి సినిమాలను చేస్తూ టాప్ హీరోయిన్, గా దూసుకుపోతుంది. ఇక ఈమె రీసెంట్ గా చేస్తున్న మిలీ అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది. విడుదల సందర్భంగా సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్ర బంధం. ప్రమోషన్స్ లో జాన్వీ కూడా చురుగ్గా పాల్గొంటుంది. ఈ తరహాలో ఓ ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ టంగ్ స్లిప్ అయియ్ విజయ్ దేవరకొండ రష్మిక వ్యవహారం బయట పెట్టేసింది.
స్టార్ పోసిషన్ లో ఉన్నవారు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా సరే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా జనాలు ట్రోలింగ్ చేసి చంపుతారు. ఇక ఇప్పుడు జాన్వి కపూర్ టంగ్ స్లిప్ అవ్వడంతో ట్రోలింగ్ బాధలను ఎదుర్కొంటుంది.మిలీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వి కపూర్ ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళింది. ఇక అక్కడ యాంకర్ స్వయంవరం పెడితే మీరు ఏ హీరోలను ఎంచుకుంటారని అడగగా జాన్వి , రన్వీర్ సింగ్ టైగర్ షార్క్ అంటూ సమాధానం వచ్చింది.

రన్వీర్ సింగ్ కి ఆల్రెడీ పెళ్లయిపోయింది కాబట్టి మరో పేరు చెప్పండి అని యాంకర్ అడగగా అప్పుడు జాన్వీ ఇంకో పేరు గురించి ఆలోచిస్తూ ఉండగా యాంకర్ మీకు విజయ్ దేవరకొండ ఫేవరెట్ కదా అన్నాడు . అప్పుడు జాన్వీ అవును కానీ ప్రాక్టికల్ గా చూస్తే విజయ్ కి పెళ్లయిపోయింది అన్నాడు అంటూ టంగ్ స్లిప్ అయింది.జాన్వి ఇలా అనడంతో రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అతి కొద్ది రోజుల్లోనే వీరికి పెళ్లికూడా అవుతుందేమో. ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక ట్రిప్పు వెళ్లడంతో ఇదే నిజమనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.