Josh Movie : సినిమా ఇండస్ట్రీ అంటేనే అంతే బాస్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు చేరుకోవాలంటే ముందు కింది నుంచే పైకి రావాలి. ఒకేసారి స్టార్ హీరో అవుతా అంటే ఎవ్వరూ పట్టించుకోరు. స్టార్ హీరో కొడుకు అయినా సరే.. కింది నుంచే పైకి రావాలి.. సామాన్యుడు అయినా సరే.. కింది నుంచే పైకి రావాలి. కష్టపడి పైకి ఎదగాలి. అలా కష్టపడి పైకి ఎదిగిన ఎందరో స్టార్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక్క రోజులో సక్సెస్ ఎవ్వరికీ రాదు. ఇప్పటి వరకు ఎవ్వరికీ రాలేదు కూడా.
ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్లు నేడు పాపులర్ యాక్టర్లు అయ్యారు. కొందరు అయితే హీరోలు కూడా అయ్యారు. అలా.. నాగచైతన్య జోష్ సినిమాలో నటించిన ఓ నటుడు ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు. నాగ చైతన్యను మించిన హీరో అయ్యాడు. అవును.. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటారా? ఇంకెవరు మన డీజే టిల్లు సిద్దూ జొన్నలగడ్డ.

Josh Movie : సిద్దూ మొదటి సినిమా జోష్
సిద్దూ నటించిన, నాగ చైతన్య నటించిన మొదటి సినిమా జోష్. కానీ.. నాగ చైతన్య అందులో హీరోగా నటిస్తే.. సిద్ధూ మాత్రం ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు అందులో. కట్ చేస్తే కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు సిద్ధూ.. నాగ చైతన్య కంటే కూడా పెద్ద స్టార్ అయిపోయాడు. జోష్ తర్వాత 2011 లో లైఫ్ బిపోర్ వెడ్డింగ్ అనే సినిమాలో సిద్ధూ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. 2016 లో గుంటూర్ టాకీస్ సినిమా ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కల్కి సినిమాలోనూ నటించాడు. చివరకు డీజే టిల్లు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు సిద్ధూ. ప్రస్తుతం సిద్ధూ చేతుల్లో చాలా సినిమాలు ఉన్నాయి. డీజే టిల్లు తర్వాత సిద్ధూ లైఫే మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరయిపోయారు సిద్ధూ.