JR NTR – Ram Charan : సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. గతంలో కొందరు రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు ఎంతో కొంత సేవ చేసారు. ఇప్పటికీ కొందరు నటీనటులు రాజకీయాలలో ఉన్నారు. అయితే ఈ తరం నటులు కూడా ఇప్పుడు రాజకీయాలలోకి రావాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా పొలిటికల్ తెరపై తెలుగు స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు సందడి చేస్తున్నాయి. వీరు నిజంగానే రాజకీయాలలోకి వస్తారా అనే అనుమానం ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్‌గా మారిన ఈ ఇద్దరు హీరోలకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు మాత్రం పొలిటికల్ ఎంట్రీ కొత్త అనే చెప్పాలి. అయితే ఊహించని విధంగా ఈ ఇద్దరు హీరోలు రాజకీయాలలోకి వస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో ఏ పార్టీలో చేరనున్నారు అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. ఈమధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కలిశారు.

JR NTR – Ram Charan : ఎంట్రీ పక్కానా..
ఇది రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఎన్టీఆర్ బీజేపీకి మద్దతు ఇవ్వడం ఖాయమంటూ మీడియాలోనూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్- బీజేపీ భేటి పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం గరంగా ఉంది. ఎన్టీఆర్ గెస్ట్‌గా జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అంతా రెడీగా ఉన్న సమయంలో ఆపేసింది. అయితే ఎన్టీఆర్ రాజకీయాలకి సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నా కూడా జూనియర్ వాటిపై స్పందించడానికి ఆసక్తి చూపడం లేదు.అయితే 2024 నాటికి మాత్రం యంగ్‌టైగర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమంటున్నారు విశ్లేషకులు. కృష్ణ లేదా గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తారన్న వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.