Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేటి తరం స్టార్ హీరోలలో నవరాసాలను అలవుకగా చేయగల స్టార్ హీరో ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. అతని నట విశ్వరూపం అలాంటిది మరి. మరిముఖ్యంగా మెథలాజికల్ మూవీస్ చేయగలిగే సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్ అని చెప్పాలి. తన నటనతో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక తన మొదటి సినిమా నిన్ను చూడాలని నుండి ఇప్పటి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్టీఆర్ కెరీర్ ను పరిశీలిస్తే తను చేయని పాత్ర లేదు. ఎన్ని చేసినా ఇంకా సరికొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తాడు. అందుకే సినిమా సినిమాకి సరికొత్త పాత్రలో తన నటను ప్రదర్శించి ఆడియన్స్ ను అబ్బురపరుస్తున్నాడు.
ఎన్టీఆర్ రీసెంట్ గా చేసిన ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ను సాధించింది.ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించాడు ఎన్టీఆర్. బీమ్ పాత్రలో తన సత్తాను చాటుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అభిమానులను గెలుచుకుంది. బాహుబలి తర్వాత తెరకెక్కించిన ఈ సినిమా కు కూడా అదే రేంజ్ లో ప్రశంసలు అందుకున్నాడు జక్కన. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్లో రిలీజ్ చేస్తున్నారట. ఈ అక్టోబర్ 21న జపాన్లో రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రమోషన్ చేసేందుకు చిత్ర బృందం జపాన్ వెళ్ళింది.

అయితే జపాన్ లో కూడా ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ మామూలుగా లేదు. జపాన్ లోని ఎన్టీఆర్ అభిమానులు తనకు ఒక స్పెషల్ మెసేజ్ తో లెటర్ ను అందించారు. ఎన్టీఆర్ బస చేస్తున్న హోటల్లో ఓ మహిళ ఆ లెటర్ ను తెచ్చి ఇచ్చింది. ఎన్టీఆర్ అంటే వారికి ఎంత ఇష్టమో అన్నది వారు ఆ లెటర్లో రాసి ఇచ్చారు.ఇక జపాన్లో కూడా తనకు అభిమానులు ఉన్నారని తెలుసుకున్న ఎన్టీఆర్ వారి ప్రేమకు ఫిదా అయిపోయాడు. అభిమాన మహిళకు షేక్ అండ్ ఇచ్చి మిగతా అభిమానులతో కాసేపు మాట్లాడాడు. అయితే ప్రస్తుతం జపాన్ అభిమానులను ఇచ్చిన లెటర్ ను అందుకుంటున్న ఎన్టీఆర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన తెలుగు హీరో ఖ్యాతి ప్రపంచమంతా ఉంది అని తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సంతోషిస్తున్నారు.