Kamal Haasan : సినిమా పరిశ్రమలో ఒకప్పుడు బాగా ఎదిగిన వారు తర్వాత చాలా ఇబ్బందులు పడ్డ సంఘటనలు మనం ఎన్నో చూశాం. చిన్న తప్పు వలన వారి కెరీర్ పూర్తిగా నాశనం అవ్వడమే కాక జీవితం మొత్తం సర్వనాశనం అవుతుంది. అలాంటి వారాలో సావిత్రి, సిల్క్ స్మిత ఇలా పలువురు ఉన్నారు. అయితే ఈ లిస్ట్‌లోకి హీరోయిన్ శ్రీవిద్య కూడా వస్తుంది. కర్ణాటకలోని సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన శ్రీవిద్య తెలుగుతో పాటు హిందీ, కన్నడ, ఇతర భాషల్లో 800కు పైగా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
సపోర్టింగ్ రోల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాల్లో చేసిన ఈ నటి ఎమోషనల్ సన్నివేశాల్లో అద్బుతంగా నటించేవారు.అందంతో పాటు అభినయం కూడా ఉండడంతో శ్రీవిద్య తమిళంలో హిట్ సినిమాల్లో నటించింది. కెరీర్ ప్రారంభంలోనే కమలహాసన్‌తో ఆమె ప్రేమలో పడింది. ఇంకా చెప్పాలంటే కమల్ సిన్సియర్‌గా శ్రీవిద్యను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు.. శ్రీవిద్య కూడా కమల్‌ప్రేమలో పడిపోయింది. అయితే కమల్ హాసన్ ఫ్యామిలీ నుండి వ్యతిరేఖత రావడంతో ఇద్దరి రిలేషన్ కి బ్రేక్ పడింది. తమిళ సినిమాలు తగ్గించేసి మలయాళ సినిమాల వైపు బాగా ఫోకస్ చేసింది. ఆ సమయంలో కుమార సంభవం అనే సినిమాతో ఆమెకు అక్కడ మంచి బ్రేకప్ వచ్చింది.

Kamal Haasan : దారుణమైన పరిస్థితి..
ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్‌తో మళ్లీ శ్రీవిద్య ప్రేమలో పడింది. పెళ్లైన ఏడాది నుండి థామస్ ఆమెని మానసకింగా వేధించడంతో అతనికి వాడాకులు ఇచ్చేసింది. అనంతకం డైరెక్టర్ భరతన్‌తో మళ్లీ ప్రేమలో పడింది. భరత్ అను కూడా మూడేళ్లు సహజీవనం చేశాక శ్రీవిద్యను వదిలించుకున్నాడు. అలా జీవితంలో మూడుసార్లు ప్రేమించి.. మూడుసార్లు మోసపోయిన శ్రీవిద్య కెరీర్ చివరి దశలో స్పైనల్ కార్డ్ క్యాన్సర్ తో బాధపడింది. అయితే చివర్లో మాత్రం తన ఆస్తిని తన ఇంటిని సంగీత పాఠశాలకు ఉపయోగించుకోవాలని… పేద పిల్లలకు సంగీతం నేర్పేందుకు ప్రత్యేకంగా ఒక టీచర్‌ను నియమించాలని కోరుకుంది. 2006లో శ్రీవిద్య మృతి చెందిన కూడా ఇప్పటికీ తిరుపనంతపురంలో శ్రీ విద్య ఇంట్లో ఆ సంగీత పాఠశాల నడుపుతున్నారు.