Kantara Movie Review : తారాగణం: రిషబ్ శెట్టి, కిషోర్, సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, మానసి సుధీర్, ప్రమోద్ శెట్టి, శనిల్ గురు తదితరులు, కెమెరా: అరవింద్ ఎస్. కాశ్యప్, ఎడిటింగ్: కె. ఎం ప్రకాశ్, ప్రతీక్ శెట్టి, సంగీతం: అజనీష్ లోకనాథ్, నిర్మాత: విజయ్ కరగండూర్, దర్శకత్వం: రిషబ్ శెట్టి, విడుదల తేదీ: 15 అక్టోబర్ 2022 కాంతార.. సినిమా రెండు వారాలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా చూసేందుకు వివిధ భాషల వాళ్లు ఎగబడుతుండగా.. ఆయా భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేయడం మొదలుపెట్టింది చిత్ర బృందం. తెలుగులో అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత ఈ సినిమాని విడుదల చేయడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.
కథ: అడవికి ఆనుకుని ఉండే ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఒక దైవదూత సూచన మేరకు తన ఐదొందల ఎకరాల భూమిని గిరిజనులకు రాసిచ్చేస్తాడు. కొద్ది రోజులకి వారసుడొకరు ఆ భూమిని తనకి ఇచ్చేయాలని గిరిజనుల మీద ఒత్తిడి తెస్తాడు. కానీ అతను అనూహ్య పరిణామాల మధ్య రక్తం కక్కుకుని చనిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి కొడుకైన దేవేంద్ర (అచ్యుత్ కుమార్) గిరిజనులతో సన్నిహితంగా మెలుగుతుంటాడు. అతడి దగ్గర పని చేస్తూ తన ఊరి వాళ్లకు తలలో నాలుకలా ఉండే శివ (రిషబ్ శెట్టి)కి.. కొత్తగా అటవీ అధికారిగా వచ్చిన మురళి (కిషోర్)కి తగువు మొదలవుతుంది. అతణ్ని చంపింది మురళీనే అనుకుంటాడు శివ. కానీ అసలు కథ వేరే అని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ శివ సోదరుడిని చంపిందెవరు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
kantara reviewనటీనటుల పర్ఫార్మెన్స్: ఓవైపు నటుడిగా.. మరోవైపు దర్శకుడిగా సినిమాకి ప్రాణం పోశారు రిషబ్ శెట్టి. ఆయన నటన.. దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకులకి ఎంతగానో నచ్చేసింది. ఇందులోని భావోద్వేగాలు అన్ని భాషల ప్రేక్షకులకూ కనెక్ట్ అవుతాయి. హీరో హీరోయిన్ల ప్రేమకథ మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. నాయికగా సప్తమి గౌడ చాలా సహజంగా కనిపించింది. అడవి గ్రామాల్లో పాత్రలు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తాయి? అనేది సహజంగా చూపిస్తూ నవ్వించారు.
టెక్నికల్ పర్ఫార్మెన్స్: చిత్రంలో అరవింద్ ఛాయాగ్రహణం, అజనీష్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పోరాట ఘట్టాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడిగా రిషబ్ ఓమెట్టు ఎదిగాడనే చెప్పాలి. కర్ణాటకలోని ఒక ఆచారాన్ని నేపథ్యంగా తీసుకుని యూనివర్శల్ అప్పీల్ వచ్చేలా ఈ కథను అతను తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. ఓవైపు లీడ్ రోల్ చేస్తూనే సినిమాని అద్భుతంగా తెరకెక్కించడం గొప్ప విషయం
ప్లస్ పాయింట్స్: కథనం నడిపిన తీరు, రిషబ్ శెట్టి నటన, పతాక సన్నివేశాలు, మైనస్ పాయింట్స్, నెమ్మదిగా సాగే కథనం, నాయకానాయికల లవ్‌ట్రాక్
ఫైనల్‌గా: మొదట్లో రెగ్యులర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ద్వితీయార్ధంలోనూ ఒక దశ వరకు కథ ముందుకు కదలదు. ఐతే విలన్ పాత్ర తాలూకు అసలు రూపం బయటపడ్డ దగ్గర్నుంచి కథలో క్యూరియాసిటీ మొదలవుతుంది. విలన్ పాత్రను అంచనా వేయడం కష్టమేమీ కాదు కానీ.. ఆ పాత్రతో కథను మలుపు తిప్పిన విధానం ఆకట్టుకుంటుంది. చివరి 20-25 నిమిషాల్లో కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు.. అద్భుతమైన సినిమాటోగ్రఫీ.. ఒ నేపథ్య సంగీతం.. వీటన్నింటికీ మించి హీరో పాత్ర విశ్వరూపం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.