కీర్తి సురేష్ కథానాయికగానే కాకుండా లేడి ఓరియెంటెడ్ పాత్రలలోను నటించి మెప్పించింది. కార్తీక్ సుబ్బ రాజ్ నిర్మాణంలో పెంగ్విన్, అలాగే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి సినిమాలు చేయగా, ఈ లేడి ఓరియెంటెడ్ సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయి. తమిళంలో రజినీకాంత్‌కి చెల్లిగా నటించిన అణ్ణాత్త సినిమా కూడా డిజాస్టర్ కావడం కీర్తికి షాకిచ్చింది. ఇక తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ సరసన కీర్తి సురేష్ రెండు సినిమాలలో హీరోయిన్గా నటించింది.ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడుస్తుంది.

Keerthy Suresh : ఏంటి సంగతి..
గత కొంత కాలంగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో బిజినెస్ మేన్తోనూ కీర్తికి పెళ్ళి చేశారు. సింగర్ అనిరుధ్తోను ఈ అమ్మడికి ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ పూర్తిగా గాసిప్స్ అని చాలాసార్లు కీర్తి నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది. అయినా తన క్రేజ్ వల్ల ఆ వార్తలకి మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. ప్రస్తుతం నాని దసరా సినిమా చేస్తుండగా, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ బ్యూటీ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.