Keerthy Suresh : మమ.. మమ.. మమ.. మమ.. మహేశా అంటూ సర్కారు వారి పాట సినిమాలో ఉన్న పాట గురించి తెలుసు కదా. ఆ పాటలో నిజంగానే కీర్తి సురేశ్ రెచ్చిపోయింది. వెండి తెర మీద మహేశ్ బాబుతో కలిసి దుమ్ములేపింది. ఆ పాట అప్పట్లో చాలా రికార్డులు క్రియేట్ చేసిందంటే మామూలు విషయం కాదు. కీర్తి సురేశ్ అంటే అలాగే ఉంటది మరి. తను ఆ పాటలో డ్యాన్స్ అద్భుతంగా చేసింది. ఆ పాటను వెండి తెర మీద చూసి కీర్తి సురేశ్ అభిమానులు అయితే తట్టుకోలేకపోయారు.

కట్ చేస్తే అదే పాటకు మళ్లీ డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది ఈ సుందరి. మామూలుగా కాదు. మమ.. మమ.. మహేశా అంటూ మాస్టర్ తో కలిసి రెచ్చిపోయింది కీర్తి సురేశ్. ఇప్పటి వరకు కీర్తి సురేశ్ ను ఇంత ఎనర్జిటిక్ గా ఎప్పుడూ చూసి ఉంటరు. అంతలా రెచ్చిపోయింది ఈ అమ్మడు. కీర్తి సురేశ్ అంటేనే అలా ఉంటది మరి. తన రేంజ్ అంటేనే అది. ఇక.. ఆ పాటకు మాస్టర్ తో కలిసి డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది ఈ భామ.
Keerthy Suresh : నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న కీర్తి సురేశ్
కీర్తి సురేశ్ ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో నాని హీరో. ఈ సినిమాను మార్చి 30న విడుదల చేయనున్నారు. పలు ఇతర సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ లేటెస్ట్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. కీర్తి సురేశ్ అస్సలు ఆగడం లేదుగా. రచ్చ రచ్చ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి.. కీర్తి ఒకప్పటి హీరోయిన్ లా లేదు. ఒకప్పుడు తను మహానటి లాంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు మాత్రం గ్లామర్ ను ఒలకబోస్తోంది. దేనికైనా రెడీ అన్నట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.