Keerthy Suresh : మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. కేరీర్ ప్రారంభంలో ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం ట్రెండీ వేర్స్ లోనూ కనువిందు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ గ్లామర్ విందు చేస్తూ మతిపోగొడుతోంది. ఈ అమ్మడు చివరిగా సర్కారు వారి పాట చిత్రంతో అలరించింది. ఇందులో తెగ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది. టెక్నీలజీ పెరుగుతున్న కొద్దీ అభిమానులు, ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యేందుకు సెలబ్రేటీలు నెట్టింట కూడా సందడి చేయాల్సి వస్తోంది.
ఈ క్రమంలో కీర్తి సురేష్ కూడా ఇంటర్నెట్ లో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు దసరా సినిమాలోని ధూమ్ ధామ్ పాటకు తన ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయి డ్యాన్స్ లు చేసింది. షర్ట్ బట్టన్స్ విప్పేసి మరీ కీర్తి సురేష్ చేసిన రచ్చ అందరిని ఆశ్చర్యంలో పడేస్తుంది. కొందరైతే కీర్తి సురేష్ డ్యాన్స్ కి తెగ ఫిదా అయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక దసరా సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్న కీర్తి సురేష్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లోనూ కీలక పాత్రలో అలరించనుంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలోనూ నటించగా.. రిలీజ్ కు సిద్ధంగా ఉంది.కీర్తి సురేష్ కు ఫ్లాపులు ఎక్కువ..సినిమాలు తక్కువ.

Keerthy Suresh : అదరగొట్టేసింది..
ఇప్పటికిి అయితే చేతిలో సరైన క్రేజీ ప్రాజెక్ట్ లేదు. అలాంటి టైమ్ లో ఎన్టీఆర్ – కొరటాల శివ లాంటి క్రేజీ ఆఫర్ రావడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మంచి హిట్ కూడా లేని సమయంలో అలాంటి కాంబినేషన్ ను రిజెక్ట్ చేస్తుందా? పైగా ఆ సినిమా కోసం పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి. అలాంటి టైమ్ లో కీర్తి చాయిస్ అని, పైగా రిజెక్టు అని వినిపించడం అంటే పెద్ద జోక్ కాక ఏమవుతుంది? అదీ కాక ఈ ప్రాజెక్టును పట్టుకోవాలని తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించిన ఒక పొడుగు కాళ్ల హీరోయిన్ కూడా తెగ ప్రయత్నిస్తోందని గ్యాసిప్ లు వున్నాయి. ప్రాజెక్ట్ క్రేజ్ అలా వుంటే అందులో హీరోయిన్ చాన్స్ వస్తే కీర్తి వదులుకుంటుందా అనే సందేహం అందరి మదిలో మెదులుతుంది.
View this post on Instagram