Adipurush : ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తొలి హీరో ప్రభాస్. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అటువంటిది. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు.
నిజానికి ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా టీజర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ.. టీజర్ చూశాక మాత్రం ప్రభాస్ అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. బాహుబలి రేంజ్ లో ఉంటుందని అందరూ భావించారు కానీ.. ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. అసలు ఇది టీజరేనా. చిన్నపిల్లల కోసం సినిమా తీశారా? టామ్ అండ్ జెర్రీ, డోరెమాన్ లో గ్రాఫిక్స్ బాగుంటుంది. కానీ.. ఇదేం గ్రాఫిక్స్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Adipurush : రావణుడి పాత్ర ఎలా ఉంటుందో దర్శకుడికి తెలియదా?
ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్.. రావణుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే సైఫ్ ఉంగరాల జుట్టుతో పెద్ద గడ్డంతో కనపడతాడు. ఆయన చూస్తే రావణాసూరిడిలా కాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీలా కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రావణాసూరిడి పాత్రపై కన్నడ నటి, కేజీఎఫ్ నటి మాళవికా అవినాష్ కూడా కామెంట్ చేశారు. రావణుడి పాత్ర ఎలా ఉంటుందో దర్శకుడికి తెలియదా అంటూ ప్రశ్నించారు. డాక్టర్ రాజ్ కుమార్ కానీ, ఎన్టీఆర్ ను కానీ చూస్తే తెలుస్తుందని చెప్పారు. లేదంటే కనీసం ఎస్వీ రంగారావు నటించిన సంపూర్ణ రామాయణం సినిమా చూసినా అర్థం అవుతుంది కదా అంటూ కామెంట్లు చేశారు. రావణుడు శివుడి భక్తుడని, ఆయన బ్రాహ్మణుడని, ఆయన 64 కళల్లో దిట్ట అంటూ చెప్పుకొచ్చారు మాళవిక. దానికి సంబంధించి ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.