Kiara Advani : కియారా అద్వానీ తెలుసు కదా. భరత్ అనే నేను, వినయ విధేయ రామా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. నిజానికి తను బాలీవుడ్ హీరోయిన్. కానీ.. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా కియారా దగ్గరైంది. సోషల్ మీడియాలోనూ తన అభిమానులతో ఎప్పటికీ టచ్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది కియారా.
తనకు సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం తను షేర్ చేసే ఫోటోలు. తను షేర్ చేసే ఫోటోలు అంతలా రెచ్చగొట్టేలా ఉంటాయి మరి. అందుకే తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. తాజాగా కియారా అద్వానీకి సంబంధించిన ఒక సరికొత్త లుక్కు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిక్యూ అనే మ్యాగజైన్ కవర్ కోసం తను సరికొత్త లుక్ లో కనిపించింది.

Kiara Advani : సర్ప కన్యలా చూస్తున్న కియారా అద్వానీ
ఈ సరికొత్త లుక్ ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో.. సర్ప కన్యలా చూస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి కియారా అద్వాని కళ్లే చాలా అందంగా ఉంటాయి. తన కళ్లతోనే తనకు అందం వచ్చింది. ప్రస్తుతం తను షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ఈ సుందరి ప్రస్తుతం దూసుకుపోతుంది. ఎందుకంటే.. టాలీవుడ్ లో రామ్ చరణ్ సరసన డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మీద తను చాలా ఆశలు పెట్టుకుంటుంది. చూద్దాం మరి ఈ సినిమాతో అయినా తనకు తెలుగులో ఫాలోయింగ్ పెరుగుతుందో.