Koratala Shiva : ఈ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఇంత చెత్త సినిమా చిరంజీవి తన 150 సినిమాలలో ఎప్పుడూ చేయలేదని మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనిలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేయడంతో ఇక అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ విడుదలైన తర్వాత ఆచార్య సినిమా చూసిన అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఇది ఇలా ఉండగా ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా మెగా అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. విడుదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఈ సినిమా మంచి ఊపుతో నడుస్తుంది. అయితే ఈ సినిమా అందుకున్న విజయానికి గాను నిన్న ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ను హైదరాబాదులో నిర్వహించడం జరిగింది. ఇక ఈ సక్సెస్ మీట్ లో ,మెగాస్టార్ చిరంజీవితో పాటు సినిమా టీమ్ మొత్తం పాల్గొన్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ మోహన్ రాజ మాట్లాడుతూ చిరంజీవి గారు డైరెక్షన్లో చొరవ తీసుకుంటారు అని ఎవరైనా అంటే వాళ్లను కచ్చితంగా కొట్టేస్తాను అని ఆయన అనుభవంతో ఇచ్చిన సలహాల వలన ఈ రోజు సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.

ఇక చివరిగా చిరంజీవి 30నిమిషాలకు పైగా తన ప్రసంగాన్ని ఇచ్చారు. ఆ ప్రసంగంలో చిరంజీవి కొరటాల శివ కు పరోక్షంగా మాట్లాడారు . చిరంజీవి మాట్లాడుతూ సినిమా అంటే పెద్దల అభిప్రాయాలను తీసుకొని సమిష్టి కృషితో చేయాలని,మాలాంటి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని పనిచేస్తే ఆ సినిమా ఫలితం చాలా బాగుంటుందని,అలా కాకుండా మీ పని మీరు చూసుకోండి , నేను చెప్పింది చేయండి అంటే ఫలితం తారుమారు అవుతుంది చెప్పుకోచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇప్పుడు చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మాటలను ఆయన పరోక్షంగా డైరెక్ట్ కొరటాల శివను అన్నట్లుగా అందరికీ అర్థమవుతుంది.