Koratala Siva : ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తరువాతి సినిమాను కొరటాల శివ తో చేయనున్నాడు. అయితే ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఐదు వారాలుగా వార్తల్లో వస్తూనే ఉంది కానీ శివ ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తూ సాగదీస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా తో మూడున్నర సంవత్సరాలు వెయిట్ చేసిన ఎన్టీఆర్ ఈ సినిమాతో అన్న అభిమానుల ముందుకు త్వరగా వస్తాడేమో అనుకుంటే మరింత ఆలస్యం అవుతుంది. అయితే కొరటాల శివ చేస్తున్న తప్పులే ఈ సినిమా కు ఆలస్యం అవడానికి కారణం అవుతున్నాయని సినీ వర్గాలలో వినిపిస్తున్నాయి.
అయితే కొరటాల శివ ఇదివరకు తీసిన ఆచార్య డిజాస్టర్ , అయింది. దీంతో ఎన్టీఆర్ సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టాలని కథలో మార్పులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనివలన ఈ సినిమా మరింత ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. పైగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నాడట. అయితే ఇప్పటికీ ఈ సినిమా హీరోయిన్ ఎవరో తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు జాహ్నవి కపూర్ అనే పేరు ను కొరటాల ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కొరటాల ఫైనల్ స్క్రిప్ట్ ను ఓకే చేస్తే జనవరి నుండైనా ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందేమో. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆలస్యం అవుతున్నది అనుకుంటే ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఫైనాన్షియల్ కష్టాలు మొదలయ్యాయట. అయితే దీనికి కారణం ఆచార్య సినిమా డిజాస్టర్ అవడం అని తెలుస్తుంది. ఆచార్య సినిమా కోసం , చిరు కొరటాల శివ కాంబినేషన్ అనగానే ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమౌంట్ ను ఇచ్చారు. కానీ ఆచార్య డిజాస్టర్ తో భారీగా నష్టపోవడం వలన కొరటాల మరియు చిరు చాలా తిప్పలు పడ్డారు. దీంతో కొరటాల శివ పైన ఎవరికీ నమ్మకం లేదు.అందుకే ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇక డిస్ట్రిబ్యూటర్లందరూ ఇప్పటినుంచి అడ్వాన్స్ అడగడంతో కొరటాల శివ తన సన్నిహితుల ద్వారా తెలిసిన లో తెలిసిన వారి ద్వారా ఫండ్ ను సేకరించె పనిలో ఉన్నట్లుగా తేలుస్తుంది.