KrishnamRaju : రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయి ఇవాళ్టికి 17 రోజులు అవుతోంది. దశదిన కర్మ జరిగి కూడా వారం కావొస్తోంది. ఆయన ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు కృష్ణంరాజు. అయితే.. కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణంరాజు జమీందారు కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిసిందే. అయినప్పటికీ.. వాళ్లు పెద్దగా ఉన్నవాళ్లేం కాదు. వాళ్ల ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కృష్ణంరాజు చదువు పూర్తికాగానే సినిమాల్లోకి వెళ్లాలనే ఆశతో ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు కృష్ణంరాజు. దీంతో కృష్ణంరాజును చెన్నైకి పంపించాడు ఆయన తండ్రి.
కానీ.. అక్కడికి వెళ్లాక అవకాశాల కోసం కృష్ణంరాజు చాలా కష్టాలు పడ్డారు. కానీ.. తన తొలి సినిమాతోనే తనేంటో నిరూపించుకున్నారు కృష్ణంరాజు. తన మొదటి సినిమానే తనలోని నటుడిని పరిచయం చేసింది. అందరి ప్రశంసలు కూడా అందుకున్నారు కృష్ణంరాజు. కానీ.. ఆ సంబురం కొన్నిరోజులే ఉంది. ఎందుకంటే.. ఆ తర్వాత మరో మూడేళ్ల వరకు ఆయనకు ఒక్క సినిమాలోనూ చాన్స్ రాలేదట. విలన్ గా చేయాలంటూ ఆయన్నుఅడిగారట. కానీ.. విలన్ గా అస్సలు వేషాలు వేయనని ఖరాఖండిగా చెప్పేశారట కృష్ణంరాజు. కృష్ణంరాజు అవకాశాల కోసం తిరుగుతూ.. చేతుల్లో డబ్బులు లేక కొన్ని రోజుల వరకు తినకుండానే పస్తులు ఉండేవారట.

KrishnamRaju : చేతిలో డబ్బులు లేక పస్తులు ఉన్న రోజులు ఎన్నో?
కానీ.. తన దగ్గర డబ్బులు లేవని, తినడానికి తిండి కూడా లేదని ఎవ్వరికీ చెప్పేవారు కాదట కృష్ణంరాజు. కొన్నిరోజులకు కృష్ణంరాజు ఫ్రెండ్ ఒకరు చెన్నైకి వెళ్లినప్పుడు అక్కడ కృష్ణంరాజును చూసి షాక్ అయ్యాడట. ఆయన బక్కచిక్కిపోయి ఉండటంతో వెంటనే ఆయన్ను ఓ హోటల్ కు తీసుకెళ్లి మంచిగా భోజనం పెట్టించాడట. ఆ తర్వాత కొన్ని డబ్బులు ఇస్తే అస్సలు తీసుకోలేదట కృష్ణంరాజు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణంరాజు తండ్రి.. తన కొడుకు బాధపడకూడదని.. వారానికి మూడు వందల రూపాయలు మనిఆర్డర్ పంపించేవాడట. దీంతో ఆ డబ్బులతో కృష్ణంరాజు సినిమా అవకాశాల కోసం తిరిగేవారట. కానీ.. ఆ రోజుల్లో కృష్ణంరాజుకు చాలా మొహమాటం ఉండేదట. ఆ మొహమాటమే ఆయన్ను చాలా ఇబ్బందుల్లో పడేసింది.