Krithi Shetty : ఉప్పెన సినిమా ద్వారా కృతి శెట్టి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. దీంతో కృతి శెట్టి కి ఆఫర్లు వరుసగా వచ్చాయి. కానీ తన మొదటి సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ పరాజయాలుగా నిలిచాయి. దీంతో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అలగే ఇటీవల తను నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి సినిమాలు ,బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమెకు అవకాశాలు ఇంకా తగ్గిపోయాయి.
వరుస అపజయాల వలన తనను అవకాశాలు పలకరించక పోవడంతో తన భవిష్యత్తు మీద ప్రభావం పెరుగుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఈమె చేతిలో ఒక సినిమా కూడా లేదు. దీంతో ఆమె తన మాతృభాష కనడంలో ట్రై చేయాలని చూస్తుంది .అలాగే ఇటీవల తమిళ్ లో కూడా ది వారియర్ తో పరిచయమైన అక్కడ కూడా ఫలితం రాలేదు. దీంతో ఆమె కేరళలో అడుగు పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు ఇక కేరళ స్టార్ హీరో టోవినో థామస్ తో ఓ చిత్రంలో నటించనుందట కృతి శెట్టి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అపజయాలను చవిచూసిన కృతి శెట్టి తన మాతృభూమి అయిన తనకు విజయాలను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. ఇప్పటివరకు అన్ని భాషల్లో కృత్తి శెట్టి కి ఎక్కువగా అపజయాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తన కెరియర్లో స్టార్ అవ్వాలంటే ఇప్పుడు తనకు విజయాలు చాలా అవసరం. ఇక విజయాలు వస్తేనే తన ఫ్యూచర్ నిలబడుతుంది. దీంతో కృతి శెట్టి కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అభిమానులు. రాబోయే కాలంలో తను మరిన్ని విజయాలను అందుకొని స్టార్ గా ఎదగాలని కోరుకుంటున్నారు.