Liger Movie : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. కొన్నాళ్లుగా ఆయన సక్సెస్ కోసం తెగ ఆరాటపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేశాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైంది. ఆచార్య తర్వాత మళ్లీ ఆ రేంజ్లో ఫ్లాప్ అయిన సినిమాగా లైగర్ నిలిచింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పూరీ జగన్నాథ్ పరిస్థితి దారుణంగా మారింది. అయితే లైగర్ ఫలితం చూశాక కంగుతిన్న జనగణమన నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతుంది. మై హోమ్ గ్రూప్ జనగణమన నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఈ సంస్థ ప్రీ ప్రొడక్షన్ కి, జరిగిన షూటింగ్ కి కలిపి రూ. 20 కోట్లు వరకూ ఖర్చు చేశారట.
Liger Movie : అడియాశలు అయినట్టేనా?
లైగర్ రిజల్ట్ చూశాక జనగణమన పై అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం సరికాదని నిర్మాతల ఆలోచనకి వచ్చారట. దీంతో మై హోమ్ గ్రూప్ జనగణమన ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు పూరితో నేరుగా చెప్పేశారట. దీంతో ప్రాజెక్ట్ పరిస్థితి అయోమయంలో పడింది అంటున్నారు. మరో నిర్మాత దొరికితేనే జనగణమన మూవీ కంప్లీట్ అవుతుంది. లేదంటే ఇక్కడితో ఆగిపోతుంది. ఈ చిత్రం బడ్జెట్ పరంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెయ్యడానికి వీలు పడదని అందుకే సినిమా ఆపేసినట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి లైగర్ అయితే పాన్ ఇండియా లెవెల్లో అనుకున్న రేంజ్ హిట్ గాని అయ్యుంటే ఈ సినిమా డెఫినెట్ గా వర్కౌట్ అయ్యి ఉండేదని చెప్పాలి. కాని దారుణంగా విఫలం అయ్యే సరికి పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం కష్టమే అంటున్నారు.

లైగర్ చిత్రానికి వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు జనగణమన మూవీపై ప్రభావం చూపుతోంది. విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత పూరి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు సైన్ చేశాడు. పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డేని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఒక షెడ్యూల్ కూడా షూట్ జరిగినట్లు తెలుస్తోంది. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి మాట్లాడుతూ.. లైగర్ కన్నా డబుల్ బడ్జెట్ తో జనగణమన తెరకెక్కిస్తున్నాం అని ప్రకటించాడు. కానీ ఊహించని విధంగా లైగర్ ఫ్లాప్ కావడంతో సినిమా అటకెక్కడం ఖాయం అని, పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం కష్టమే అని అంటున్నారు.