Mahesh Babu : తెలుగు సినీ పరిశ్రమలో వారసుల హవా ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శక నిర్మాతల తనయులు హీరోలుగా, తనయలు హీరోయిన్స్‌గా ఇండస్ట్రీకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు ఆయన పిల్లలు కూడా సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే గౌతమ్ 1 నేనొక్కడినే చిత్రంతో సినీ ప్రేక్షకులని పలకరించగా, సితార కూడా త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం కానున్నదని సమాచారం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను చేస్తున్నాడు.
ఈ చిత్రం ద్వారానే తన కూతురు సితార ఘట్టమనేనిని సినీ రంగానికి పరిచయం చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం సితార యాక్టింగ్, డ్యాన్స్‌లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గ ఉంటూ సందడి చేస్తుంది. అంతేకాదు తన తండ్రి సినిమాలకు సంబంధించిన పాటలు పాడడం, డ్యాన్స్ లు చేయడం చేస్తుంది. త్వరలోనే సితార ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఓ పాట పాత్ర హైలైట్ కాబోతుందట. ఆమెను కాపాడేందుకు హీరో ప్రయత్నాలు చేస్తుంటాడట.

Mahesh Babu : అతి త్వరలోనే..
సినిమాలో మహేశ్ – సితార మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని చోట్ల ఫన్నీగా, కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటాయని కూడా ప్రచారం నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటే దాదాపు రెండు దశాబ్దాలుగా స్టామినాను చూపిస్తూ దూసుకెళ్తోన్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. మహేష్ చివరిగా సర్కారు వారి పాట చిత్రంతో సందడి చేసిన విషయం తెలిసిందే. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తుండగా,ఈ మూవీ తర్వాత రాజమౌళితో ఓ చిత్రం చేయనున్నట్టు సమాచారం