Mahesh Babu : మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పట్నుంచి..? దసరా తర్వాత అని దర్శక నిర్మాతలు చెప్పారు కానీ వాళ్లు చెప్పాక పరిస్థితులు మారిపోయాయి. సూపర్ స్టార్ తల్లి ఇందిరా దేవి మరణంతో ఆయన విషాదంలోకి వెళ్లిపోయారు. మరి ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు సినిమా న్యూ షెడ్యూల్ ఎప్పుడనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేసింది. తల్లి మరణం నుంచి త్వరగాను కోలుకున్న మహేష్.. అనుకున్న దానికంటే ముందుగానే షెడ్యూల్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో కొన్నేళ్లుగా వరస విషాదాలు జరుగుతున్నాయి. విజయనిర్మల మరణం నుంచి పూర్తిగా కోలుకోక ముందే మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించాడు. ఆయన గాయం నుంచి ఘట్టమనేని ఫ్యామిలీ బయటికి రాకముందే..
మహేష్ అమ్మగారు ఇందిరా దేవి మరణం అందరినీ కలిచివేసింది. ఈమె మరణంతో విషాదంలోకి వెళ్లిపోయారు సూపర్ స్టార్. ఇంకా ఆ బాధలోనే ఉన్నారు మహేష్ బాబు. ఈ మధ్యే అమ్మగారి అస్థికలు గంగా నదిలో కలిపారు ఈయన.ఇదిలా ఉంటే SSMB 28 గురించి తాజాగా కొన్ని అప్‌డేట్స్ బయటికొచ్చాయి. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి.. ఫస్ట్ షెడ్యూల్ చాలా వేగంగా పూర్తి చేసారు త్రివిక్రమ్. రెండో షెడ్యూల్‌ను దసరా తర్వాత ప్లాన్ చేసారు. అక్టోబర్ 10 నుంచి ఈ షెడ్యూల్ అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో మహేష్ సినిమా షెడ్యూల్ మొదలవ్వడం కాస్త కష్టమే అనుకున్నారంతా. కానీ చెప్పినట్లుగానే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ అక్టోబర్ 10 నుంచే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇందులో విలన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు షూట్ చేయనున్నారు దర్శకుడు త్రివిక్రమ్. అయితే దానికంటే ముందు కొన్ని పర్సనల్ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు సూపర్ స్టార్. అమ్మ ఇందిరా దేవి దశదినకర్మ చేయాల్సి ఉంది. ఇవన్నీ అయ్యాకే షూటింగ్ అంటున్నారు సూపర్ స్టార్. అక్టోబర్ రెండో వారంలో మహేష్ బాబు షూటింగ్‌కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దర్శకుడు త్రివిక్రమ్ కూడా మహేష్‌కు తగ్గట్లుగానే షెడ్యూల్స్‌లో అడ్జస్ట్ మెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫుల్ మాసీగా కనిపిస్తున్నారు సూపర్ స్టార్. దీనికోసం గడ్డం, మీసాలు పెంచేసి రఫ్ లుక్‌లోకి మారిపోయారు మహేష్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.