Mahesh Babu ; ఇటీవల మహేష్ బాబు తల్లి సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందేే.అలాగే గత ఆదివారం పెద్దకర్మ కూడా పూర్తయిపోయింది. సినీ పరిశ్రమ నుండి అనేకమంది హాజరై ఆమెకు నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణగారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అలాగే కృష్ణ మరియు మహేష్ బాబు లను పరామర్శించారు గోపాలకృష్ణ. ఇక ఘట్టమనేని కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఒక వీడియోని చేసి తన యూట్యూబ్లో షేర్ చేశాడు.
అయితే ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోపాలకృష్ణ మాట్లాడుతూ… ఘట్టమనేని కుటుంబంతో నాకు చాలా సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉందని అలాగే కృష్ణ, మహేష్ బాబు , రమేష్ బాబు , ఆదిశేషగిరిరావులతో చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటున్నానని, ఇక నేను వారి కుటుంబంలో ఒకడిలా ఉండేవాడినని తెలియజేశారు. పనిమీద నేను అమెరికా వెళ్లి వచ్చేలోగా ఇలా జరిగిపోయిందని తెలియజేశారు గోపాలకృష్ణ.ఇక మొన్న జరిగిన సంస్థాన సభలో కృష్ణ గారిని కలిసినప్పుడు నా గుండె తరుక్కుపోయిందని ,ఇన్ని సంవత్సరాలలో మహేష్ బాబుని నేను ఎప్పుడూ అలా చూడలేదంటూ గోపాలకృష్ణ తెలియజేశారు.

ఇందిరా దేవి అంటే మా దృష్టిలో ఒక దేవత, మహాలక్ష్మి తను ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. అందరితో చిరునవ్వు తో మాట్లాడుతుందని తెలియచెప్పారు. ఇక నిన్నటి రోజున కృష్ణ గారిని ఆ కార్యక్రమంలో చూసినప్పుడు ఆయన మొహం చూస్తుంటే నాకు చాలా ఆవేదన కలిగిందని , అలాగే పరుచూరి ఫ్యామిలీకి పరిచయమైనప్పటినుంచి మహేష్ బాబును నవ్వుతూనే చూస్తున్నానని కానీ ఇంతలా ఏ రోజు మహేష్ బాబును చూడలేదని అలాంటిది తల్లి మరణంతో ఆ చిరునవ్వును చూడలేకపోయాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో మహేష్ బాబు మరియు కృష్ణ గార్లు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.