Manchu Vishnu : మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు విష్ణు ఏ విషయంపైనైన ముక్కుసూటిగా మాట్లాడతాడు అనే విషయం తెలిసిందే. ఒక్కోసారి మంచు విష్ణు చేసే పనులు వివాదాస్పదం అవుతుంటాయి. ఆయనపై తెగ ట్రోల్స్ చేస్తుంటారు. మోహన్ బాబు ఫసక్ అయినా, మంచు లక్ష్మీ నిలదీస్ఫై అయినా ఇలా ఎన్నెన్నో కూడా ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. మా ఎన్నికల్లో మంచు విష్ణు మాట్లాడిన మాటలన్నీ కూడా దారుణంగా వైరల్ అయ్యాయి. అవి ఎంతగా నెట్టింట్లో మీమ్స్, ట్రోల్స్‌లో వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచు ఫ్యామిలీ మీద నిత్యం ఏదో ఒక రకమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది.
మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా మీద ట్రోలింగ్ హద్దులు దాటడంతో చర్యలు తీసుకునేందుకు మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. అయినప్పటికి అవి ఆగడం లేదు. ఇక తాజాగా మంచు విష్ణు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయనకు ట్రోలింగ్ గురించి ప్రశ్న ఎదురు రాగా, దానికి ఆయన ఓ నటుడు కావాలని చేయిస్తున్నాడు. జూబ్లిహిల్స్‌లోని ఓ ఆఫీసు నుండి 85 శాతం మాపై ట్రోలింగ్ చేయిస్తున్నట్టు తెలిసింది. వాళ్లని మేం ట్రోల్ చేయించాల్సిన అవసరం లేదు. ప్రకృతే చూస్తుంది. ఆల్రెడీ ఎలాంటి వార్తలు వచ్చాయో చూశాం కదా అంటూ విష్ణు కౌంటర్ ఇచ్చాడు.

Manchu Vishnu : కౌంటర్ ఇచ్చాడుగా…
ట్రోలర్లకు ఒకపక్క టార్గెట్ అవుతూనే మరో పక్క తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు మంచు విష్ణు. ఇప్పుడు మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎందుకు సిద్ధమవుతున్నాడు. సూర్య డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది. సన్నిలియోన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.దసరా సందర్భంగా ప్రేక్షకులను మంచు విష్ణు అలరించబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా విడుదల కాలేదు.