Manchu Vishnu : మంచు విష్ణు సన్నీ లియోన్ పాయల్ రాజ్ పుత్ ఈ ముగ్గురి కలయికలో ఇటీవల వచ్చిన సినిమా జిన్నా. డైరెక్టర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా శ్రీను వైట్ల వ్యవహరించారు. ఇంతకుముందు విష్ణు చేసిన దేనికైనా రెడీ,ఈడోరకం ఆడోరకం , వంటి కామెడీ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఈ జిన్నా సినిమాకు కథను అందించారు. ఇక ఈ జిన్నా సినిమా కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని సమాచారం. ఈ సినిమా పైన మంచు విష్ణు తో పాటు సన్నీలియోన్ మరియు పాయల్ రాజ్ పుత్ భారీగా నమ్మకాన్ని , పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ మలయాళం వంటి భాషల్లో ఈరోజు విడుదల అయింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పెద్దగా థియేటర్లు లభించలేదు ఇక హైదరాబాదులో థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంగ్లీష్ సినిమా అయినా బ్లాక్ ఆడమ్స్ కు ఎక్కువగా థియేటర్లు లభించడం వలన యూఎస్ ప్రిమియర్లు కూడా పడలేదని సమాచారం. అయినప్పటికీ జిన్నా సినిమాను చాలామంది చూశారు.ఈ సినిమా బాగుందని చాలామంది ట్విట్టర్లో తెలియజేస్తున్నారు.
ఇలాంటి మంచి కామెడీ టైమింగ్ సినిమాతో మరొకసారి ప్రేక్షకులు ముందుకు వచ్చి విష్ణు కం బ్యాక్ ఇచ్చారని అందరూ కామెంట్ చేస్తున్నారు.

కానీ సన్నీలియోన్ అభిమానులు మాత్రం ఖచ్చితంగా బాధపడుతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఒక హర్రర్ కామెడీ జొన్నర్ కథ తో నడుస్తుందని ఈ సినిమా కథ విషయంలో మంచు విష్ణు సరైన నిర్ణయం తీసుకున్నారని తెలియజేస్తున్నారు. అయితే మరొక ట్విట్టర్ యూజర్ కథ పరంగా సినిమా చాలా బాగుంది కానీ కాస్త నెమ్మదిగా సాగుతుంది అని చెప్పాడు. అలాగే సన్నీలియోన్ మరియు మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందని ఇక ఈ సినిమాలో రాజ్ పుత్ పాయల్ అందాలు ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక చివరిలో క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రేటింగ్ పరంగా చూస్తే ఈ సినిమాకు 3.23/5 ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జిన్నా సినిమా పైన మంచి టాక్ నడుస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.