Manchu Vishnu : త‌నని దున్న‌పోతుతో పోల్చుకున్న మంచు విష్ణు.. తెగ ఆడేసుకుంటున్నారుగా..!

Advertisement

Manchu Vishnu :  మంచు మోహ‌న్ బాబు న‌ట వార‌సులిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మ‌నోజ్, మంచు విష్ణు ఒక‌ప్పుడు అడ‌పాద‌డ‌పా చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ మ‌ధ్య మాత్రం ఇద్ద‌రు ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా అందించ‌లేక‌పోతున్నారు. మంచు మ‌నోజ్ చాలా కాలంగా సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంటున్నా విష్ణు మాత్రం అడ‌పాద‌డ‌పా ఏదో ఒక సినిమా చేస్తూ వ‌స్తున్నాడు. తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం జిన్నా. ఈ సినిమాలో విష్ణు స‌ర‌స‌న పాయల్ రాజ్‌పుత్ , సన్నీ లియోన్ క‌థానాయిక‌లుగా యాక్ట్ చేస్తున్నారు. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

జిన్నా సినిమాకు ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ నెలలో ఆడియన్స్ ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందివ్వగా.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం మంచు విష్ణు చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. తాజాగా బాహుబలి సినిమాలో ఉండే బలమైన దున్నపోతు తరహాలో..

Advertisement
manchu vishnu trolled by netigens
manchu vishnu trolled by netigens

Manchu Vishnu : భ‌లే బుక్కయ్యాడు..

కండలు తిరిగిన దృఢమైన దున్నపోతు ఫొటోను మంచు విష్ణు త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కి సరదాగా.. ‘నేను పది పుషప్స్ చేసిన తర్వాత ఇలా ఉంటానేమోనని ఊహించుకుంటూ ఉంటాను..’ అని కామెంట్ పెట్టారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ పోస్ట్‌పై ఇతర హీరోల అభిమానులు ట్రోలింగ్ చేస్తుంటే.. ఆయన అభిమానులు భలేగా చెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజమే అన్నా మీరు జస్ట్ మా ప్రెసిడెంట్ కానీ ఇండియా ప్రెసిడెంట్ లా ఫీల్ అవుతున్నారు” అంటూ కొంద‌రు సెటైర్ వేశారు. కాగా, మంచు విష్ణుతో సినిమాలు చేయడం నిర్మాతలు ఎప్పుడో మానేశారు. దీంతో సొంత నిర్మాణ సంస్థలు చిత్రాలు చేసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో మోసగాళ్లు మూవీ చేశారు. ఇది తేడా కొట్టేసింది.

Advertisement