Mani Ratnam : మేలిమి ముత్యాల్లాంటి సినిమాలతో ప్రేక్షకులని రంజింపజేసే దర్శకుడు మణిరత్నం. ఒకప్పుడు ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ కొట్టేవి. అయితే ఇటీవల సరైన సక్సెస్ అందుకోలేకపోతున్న మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని భాషలలో ఈ సినిమా విడుదల చేసే ప్లాన్ చేస్తుండగా, తమిళంతో పాటు హిందీ మరియు తెలుగు లో ఈ చిత్రం భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందనే నమ్మకంగా చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్రిష , ఐశ్వర్య రాయ్ లతో పాటు హీరోలు మరియు ఇతర టెక్నీషియన్స్ కూడా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటనున్నారు. ఈ సందర్భంగా మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐశ్వర్య రాయ్ మరియు త్రిషల మధ్య సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా సమస్య ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు కూడా చాలా సీరియస్ గా ఎదురు పడ్డ సమయంలో ఉండాలి, కాని అది వారికి కష్టం అయింది. దీని కోసం మేము షూటింగ్ జరుగుతున్న సమయంలో తప్ప కలవనివ్వలేదు.

Mani Ratnam : భారీ అంచనాలతో..
ఇద్దరూ కూడా షూటింగ్ పూర్తి అయ్యే వరకు కలవకూడదు అని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సాధ్యం అయినంత వరకు షూటింగ్ ముగిసే వరకు వారిద్దరిని కలవనివ్వలేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా అద్భుతం గా వచ్చింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు. మొదటి భాగం రన్ టైం పై అయితే అధికారిక రన్ టైం బయటకి వచ్చింది. ఈ చిత్రం టోటల్ 167 నిమిషాల నిడివిగా ఉంటుందట. అంటే 2 గంటల 47 నిమిషాలు ఈ చిత్రం భారీ ట్రీట్ ఇవ్వనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.