Chiranjeevi : చిరంజీవి తలరాతని డిసైడ్ చేసే నెంబర్ ఇది.. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్

Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ చకచకా పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవలే జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు.

Advertisement

దీంతో హిందీ మార్కెట్ లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.నైజాం ఏరియాలో భారీ స్థాయిలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.22 కోట్లు చేసిందట. చిరంజీవి సినిమాకు నైజాం ఏరియాలో భారీగా బిజినెస్ చేస్తుంది. సీడెడ్ లో రూ.13.50 కోట్లు పలికింది. ఇక ఆంధ్ర మొత్తంలో చూస్తే రూ.35 కోట్లు పలికింది. అంటే.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే గాడ్ ఫాదర్ మూవీ ఏకంగా రూ.70.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది.

Advertisement
Megastar chiranjeevi godfather box office target
Megastar chiranjeevi godfather box office target

Chiranjeevi : నైజాం ఏరియాలో రూ.22 కోట్లు

ఏపీ, తెలంగాణ కాకుండా కర్ణాటకలో కూడా ఈ సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటకలో రూ.6.50 కోట్ల బిజినెస్ చేసింది. ఇక.. హిందీలో నార్త్ మొత్తం కూడా రూ.6.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ చూసుకుంటే రూ.7.50 కోట్ల బిజినెస్ చేసింది. అంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ అటూ ఇటుగా రూ.100 కోట్లకు చేరుకుంది. ఈ సినిమాకు పోటీగా అక్టోబర్ 5న నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా రిలీజ్ కానుంది. అలాగే బెల్లంకొండ స్వాతిముత్యం సినిమా కూడా రిలీజ్ కానుంది. చూద్దాం మరి గాడ్ ఫాదర్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో?

Advertisement