Chiranjeevi : మోహన్ రాజా ( mohan raja ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ( Godfather ) సినిమా ఈనెల 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ,ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వయసు పెరుగుతున్న తన జోష్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు మన మెగాస్టార్. వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అప్పట్లో తనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉండేదో ఇప్పుడు అలాగే ఉందట. అయితే ఇప్పుడు మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా మంచి పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ సినిమాతో ఈనెల 5న అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ ను చేస్తున్నాడు. దీనిలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో తాజాగా ముంబైలో ప్రమోషన్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ ఓ ప్రెస్ మీట్ లో గాడ్ ఫాదర్ సీక్వెల్ గురించి మాట్లాడాడు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సీక్వెల్ ను తెరకెక్కించే అవకాశం ఉంటుందన్న సీక్రెట్ ను మెగాస్టార్ ఆ ప్రెస్ మీట్ లో రివిల్ చేశాడు. కచ్చితంగా ఉంటుందని అయితే చెప్పలేదు కాని గాడ్ ఫాదర్ రిజల్ట్ ను బట్టి సీక్వెల్ ను రూపొందించే అవకాశం ఉందని అంచనా.

అయితే ఈ గాడ్ ఫాదర్ మూవీని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను రీమేక్ గా తీస్తున్నారు. మలయాళం లోని లూసిఫర్ మూవీలో మోహన్ లాల్ నటించగా తెలుగులో మెగాస్టార్ నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించగా సత్యదేవ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటించనుంది.ఇక ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ గాడ్ ఫాదర్ కు ఎస్ ఎస్ తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.