Naresh vs NagaBabu : గత సంవత్సరం జరిగిన మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఎంత రసభరితంగా జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా అప్పుడు ప్రకాష్ రాజ్ వర్గానికి మరియు, విష్ణు మంచు వర్గానికి మాటలు యుద్ధం జరిగింది. అప్పుడు ప్రకాష్ రాజ్ వర్గంలోని నాగబాబుకు మరియు మంచు విష్ణు వర్గంలోని నరేష్ మధ్య మాటల యుద్ధం జరిగిందని చెప్పాలి. అవి హద్దులు దాటి వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగియటంతో ఆగిపోతుంది అనుకున్నారు. ఇక ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. కాగా మంచు విష్ణు కంటే హరీష్ నరేష్ ఆ పదవి బాధ్యతలు నిర్వహించారట. ఇక ఆయన పదవీకాలం ముగియడంతో 2021 అక్టోబర్ లో అధ్యక్షుని ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది . దీనిలో ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు పోటీ చేయగా మాజీ అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణుకు మద్దతిచ్చారు. ప్రకాష్ రాజ్ కి నాగబాబు మద్దతు ఇచ్చారు.
దీంతో మునిపెన్నడూ లేని విధంగా ఎన్నికలలో ప్రత్యర్థుల మధ్య ఆవేశాలు వచ్చాయి.
ముఖ్యంగా నాగబాబు మరియు నరేష్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. వీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రతిఆరోపణలు చేసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ గురించే కాకుండా వారి వ్యక్తిగత విషయాల వరకు కూడా వెళ్లారు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని మాట్లాడిన వారిపై నాగబాబు , రివర్స్ కౌంటర్లు ఇచ్చాడు. అలాగే ఒకసారి కోటా శ్రీనివాసరావు గారిని ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు వాడు అని అన్నాడు నాగబాబు. ఇక ఈ మాట అప్పుడు ఒక సంచలనం రేపింది. ఒకరకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పరువును నాగబాబు , నరేష్ , జీవిత , హేమ, బండ్ల గణేష్ దిగజారుస్తున్నారు అని చెప్పాలి. ఎన్నికల తర్వాత కూడా ఈ గొడవలు ఏమాత్రం ఆగలేదు. మంచు విష్ణు గెలవటంతో ఎన్నికల్లో ఎవో అవకతవకలు జరిగాయని ప్రకాష్ రాజ్ వర్గంలో గెలిచిన సభ్యులు రాజీనామా చేశారు. అలాగే మంచు విష్ణు యొక్క పనితీరు ఎప్పటికప్పుడు మేము గమనిస్తూనే ఉంటామని హెచ్చరించాడు ప్రకాష్ రాజ్. ఇక తాజాగా మంచు విష్ణు విజయంలో కీలకపాత్ర వహించిన నరేష్ ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నాగబాబు.

ఆయన మాట్లాడుతూ ఈ అసోసియేషన్లో నరేష్ అంతటి చెత్త వాడు లేడని, లీటిగేషన్ పెట్టే ప్రెసిడెంట్ వీడు ఒక్కడే అని మాట్లాడాడు. మా అసోసియేషన్ కి నరేష్ వలన ఎలాంటి ఉపయోగం లేదని, అతని వల్ల చాలా కీడు జరిగిందని చెప్పాడు. అలాగే మా అసోసియేషన్ లో జరిగే ప్రతి విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేశాడు. మా అసోసియేషన్ లోని విషయాలు ప్రజలకు అవసరంలేని విషయాలు అవి ఎందుకు చెప్పాలి అంటూ ప్రశ్నించాడు. అలాగే తాను ఒక దైవంశ సంభూతుడు అని ఫీల్ అవుతుంటాడని అందుకే ఎన్నికల్లో శ్రీకృష్ణుడు పాత్ర వహించాడని, అతనికి ఇదొక మానసిక జబ్బు అని తెలియజేశారు. ఇక ఇప్పుడు మా అసోసియేషన్ సభ్యుల మధ్య గొడవలు పెట్టి తాను పరిశ్రమకు పెద్దగా నిలవాలనుకుంటు న్నాడని అన్నారు. ఇక ఇప్పుడు నరేష్ నీ ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఎవరైనా నరేష్ ను విమర్శిస్తే వెంటనే నరేష్ రియాక్ట్ అవుతాడని మనకు తెలుసు. ఈ క్రమంలో నరేష్ నాగబాబుపై ఎలాంటి కౌంటర్స్ వేస్తాడు వేచి చూడాలి.