Nagarjuna : నాగ చైతన్య- సమంత విడాకుల తర్వాత అక్కినేని ఫ్యామిలీ తెగ వార్తలలో నిలుస్తుంది. వారికి సంబంధించిన వార్తలకు అడ్డే లేదు. ఇక కొద్ది రోజులుగా నాగార్జునకి సంబంధించి కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున రాజకీయాలలోకి రాబోతున్నాడని, ముఖ్యంగా ఆయన విజయవాడ ఎంపీగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు వస్తున్న ప్రచారం జరుగుతుండగా, నేరుగానే స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే తనకు లేదని నాగార్జున తేల్చిచెప్పేశారు. అంతేకాదు విజయవాడ ఎంపీగా కూడా తాను పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తనపై ఇలాగే ప్రచారం చేస్తున్నారంటూ నాగార్జున అసహనం వ్యక్తం చేసారు. నాగార్జున రాజకీయాలలోకి రాబోతున్నాడని ఎందుకు ప్రచారం జరిగింది అంటే.. టాలీవుడ్ హీరో నాగార్జునకు సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి రాకముందు నుంచి వీరిద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ గతంలో జైల్లో ఉన్న సమయంలోనూ నాగార్జున వెళ్లి పరామర్శించారు. పలు కీలక నిర్ణయాల్లో భాగస్వామి కూడా అయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున నాగార్జున విజయవాడ లోక్ సభ స్థానం సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది.

Nagarjuna : క్లారిటీ ఇచ్చేశారు..
ప్రస్తుతం విజయవాడలో వైసీపీకి గట్టి అభ్యర్ది లేకపోవడం, గతంలో పోటీ చేసిన పీవీపీ వంటి వారు తప్పుకోవడంతో నాగార్జునను తీసుకొస్తున్నట్లు ప్రచారాలు అయితే నడిచాయి. మొత్తానికి నాగార్జున దానిని ఖండించారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే 2024లో ఎలాగైనా విజయవాడ ఎంపీ సీటును గెలుచుకోవాలన్న దిశగా సాగుతున్న జగన్… విజయవాడ నుంచి పోటీ చేయాలని నాగార్జునకు ఆఫర్ ఇచ్చారని కూడా వార్తలు వినిపించాయి. ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా విడుదల కాగా, ఇది చాలానే అంచనాలు పెంచింది.