Nabha Natesh : నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులని దోచుకున్న అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది నభా. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా నటేష్ పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ మ్యాస్ట్రో మూవీలో మెరిసింది. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోవడంతో నభా సైలెంట్ అయింది. ఇటీవల సోషల్ మీడియాలోను పెద్దగా అలరించడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడికి సరైన ఆఫర్స్ లేకపోవడంతో తన స్వరాష్ట్రం మహారాష్ట్రకి చెక్కేసినట్టు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఎంతో రిలాక్స్ గా వెకేషన్ ఆస్వాదిస్తోంది నభా నటేష్. ఒంటరిగా సముద్రయానం చేస్తోంది.సముద్ర తీరాన సోకుల వల విసురుతూ కుర్రాళ్ల హృదయాలలో రైళ్లు పరుగెత్తిస్తుంది. తాజాగా అమ్మడు వెకేషన్ లో ఉన్న ఫోటోల్ని షేర్ చేసింది. ఇందులో థై షోతో కుర్రాళ్లలో గుబులు పుటిస్తోంది. మనుషులకు దూరంగా సీ అందాలు ఆస్వాదిస్తోంది. తన ఫొటోకి నభా ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా పెట్టింది. ఆ సముద్రంలోకి తీసుకెళ్లండి. నన్ను ఓపెన్ సముద్రంలో ప్రయాణించనివ్వండి. వెచ్చని మరియు ఉప్పగా ఉండే గాలిని పీల్చుకోవడానికి.ఉన్న దాని గురించి ఆలోచించండి..లేని దాని గురించి ఆరాటపడకండి చిల్ అంటూ చెప్పుకొచ్చింది.

Nabha Natesh : నభా .. ఏందబ్బా..
నభా నటేష్‌కు అవకాశాలు రాకుండా ఉండడానికి తన నిర్ణయమే కారణమని.. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలనీ, మళ్లీ తెలుగు సినిమాల్లో నటించి ఫామ్‌లోకి రావాలనీ కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. సరైన కథలు ఎంచుకోకుండా ఇష్టమొచ్చిన సినిమాలు చేయడం వల్లనే నభా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొందని అంటున్నారు. పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా ఒక్కసారిగా టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయింది. దానికి తోడు అమ్మడి అందాల ఆరబోత కూడా సెగలు పుట్టించింది. అసలు ఈ స్థాయిలో కన్నడ బ్యూటీ రెచ్చిపోతుందా అని ముక్కున వేలేసుకునేలా చేసింది నభా నటేష్. కాని ఇప్పుడు చాలా సైలెంట్ అయింది.