Samantha : అనుష్క శెట్టి ఈ ముద్దుగుమ్మను తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు. దాదాపుగా ఇప్పుడు స్వీటీ వయసు 40 ఏళ్లకు దగ్గరవుతుంది. అయినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకంటే చిన్నవాడైనా నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన వయస్సు వరైనా తమన్నా, నాయనతార ఇప్పటికి స్టార్ హీరోల పక్కన చేస్తుంటే అనుష్క కు మాత్రం ఛాన్సులు రావడం లేదు అనే చెప్పాలి. అయితే అనుష్క కెరీర్లో ఎక్కువ గా ప్రభాస్‌తో రూమర్ల వచ్చేవి. వీరిద్దరు కలసి చేసిన అన్నీ సినిమాలు సూపర్ హిట్టే అయ్యాయి.
ప్రభాస్ – అనుష్క జంటను , వీరి అన్ స్క్రీన్ రొమాన్స్ ను ఎంజాయ్ చేసే వాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పాలి. ఇక వీరికి పెళ్లి అయితే బాగుండు అని కూడా చాలామంది అనుకున్నారు. అలాగే అప్పట్లో అనుష్క – ప్రభాస్‌కు సోషల్ మీడియా సాక్షిగా వేల సార్లు పెళ్లయింది అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ జంట క్రేజ్ అలా ఉండేది మరి. అయితే ఈ రూమర్ల కంటే ముందే అనుష్క పై ఇంకొక రూమర్ వచ్చింది. అయితే అనుష్క మిర్చి సినిమా చేస్తున్నప్పుడే నాగచైతన్య – అనుష్క ప్రేమలో ఉన్నారన్న వార్త తెగ వైరల్ అయింది.

ఇక వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, వీరి పెళ్లికి నాగార్జున కూడా ఓకే చెప్పారని పుకార్లు వచ్చాయి. ఇవి పుకార్లు అయితే పర్వాలేదు కాని మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిన ఆంధ్రజ్యోతి తన ప్రధాన దినపత్రికలో ఏకంగా వీరి పెళ్లి జరగబోతోందని న్యూస్ రాసారు. ఇక ఈ న్యూస్ అప్పట్లో సచ్చలనం గా మారింది. ఈ విషయం పై నాగార్జున కూడా స్పందించి, నిజం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు అంటూ ఆంధ్రజోతి ఛానల్ పై మండిపడ్డారు. ఇక ఆ తరువాత ఆంధ్ర జ్యోతి కూడా తన తప్పును సవరించుకుంది.