Naga Chaitanya : తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు అక్కినేని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు ఇద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా “ఏ మాయ చేసావే”. ఈ సినిమా షూటింగ్లో వారు ఒకరినొకరు ఇష్టపడి ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. వీరి పెళ్లి ని ఇరు కుటుంబాలు అంగీకరించి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత ఈ జంట చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వాళ్లు చేసిన ప్రతి విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు తెలియజేశారు.
ఇక వీళ్ళ అనుబంధం చూసి అభిమానులు అందరూ వీరిని క్యూటెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా వీరు పెళ్లి అయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద బాంబు పేల్చారు.ఏ కారణం చేత వీరు విడాకులు తీసుకున్నారో అన్న కారణాలు ఇంతవరకు బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రకాలైన రూమర్స్ వచ్చాయి. అయితే విడాకులు తర్వాత సమంత నాగచైతన్య పై లేనిపోనివన్నీ చెప్పుకొచ్చింది.

కానీ నాగచైతన్య సమంత గురించి ఏమాత్రం చెప్పలేదు. ఇటీవల తన సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య తాము విడాకులు తీసుకున్నాక నేను హ్యాపీ తను హ్యాపీ అంటూ చెప్పారు. అలాగే విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య సమంత కు నచ్చిన పనులు చేస్తున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే సామ్ కు మొక్కలు అంటే చాలా ఇష్టం .వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు పెరట్లో కొన్ని చెట్లను పెంచారట.అయితే వారు విడిపోయిన తర్వాత కూడా చైతన్య వాటిని ఇంకా భద్రంగా చూసుకుంటున్నాడట..