Naga Chaitanya Heroine : సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరు ఎవరితో రిలేషన్ లో కలిసి ఉంటారో ఎవరు ఊహించలేం. ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో చాలానే జరుగుతుంటాయి. ఇక కొంతమంది సెలబ్రిటీస్ అయితే రిలేషన్ షిప్ లో కొన్నాళ్లు ఉన్న తర్వాత వారి వారి మధ్య గల రిలేషన్ ను బహిర్గతం చేస్తారు. అయితే తాజాగా ఇలాంటి ఒక ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో హీరో గౌతమ్ మరియు మంజిమా మోహన్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అదే నిజమని మంజిమా మోహన్ సోషల్ మీడియా వేదికగా చేశారు చేశారు . ఇక ఇటీవల వీరి ప్రేమ వ్యవహారాన్ని ఈ జంట అధికారికంగా తెలియజేశారు.
సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి మంజిమా మోహన్ గౌతమ్ గురించి చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ గురించి ఎమోషనల్ గా ఒక నోట్ ను రాసింది మంజిమా మోహన్. గార్డియన్ ఏంజెల్ లా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావని, అలాగే నేను నా లైఫ్ లో ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రతిసారి నాకు అండగా నిలబడి వాటి నుండి నన్ను బయటికి తీసుకువచ్చావని మంజుమా మోహన్ తెలిపింది. ఇక నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు ఇక నాకు అన్ని నువ్వే , అంటూ మంజిమా మోహన్ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మరియు సెలబ్రిటీలు ఆమెకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు వీరి ప్రేమ వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది. అయితే హీరో గౌతమ్ గురించి మనకు తెలిసిందే. కడల్ సినిమాతో గౌతమ్ హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే మంజిమా మోహన్ నాగచైతన్యతో కలిసి సాహసం శ్వాసగా సాగిపోపో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా మంజిమా మోహన్ నటించింది. ఇక ఇప్పుడు మంజుమా మోహన్ కేవలం తెలుగు సినిమాలే కాక తమిళ్ , మలయాళ సినిమాలు కూడా చేస్తుంది.