Naga Chaitanya : ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు నాగ చైతన్య, సమంత. వీరిద్దరు ఊహించని విధంగా విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. అక్టోబర్ 2న తాము విడిపోతున్న విషయాన్ని సమంత తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు. చాలా కాలం నుంచి ఈ విషయం గురించి ఆలోచించి నాగ చైతన్య, నేను ఓ నిర్ణయానికి వచ్చాము. ఇక నుంచి మేము ఇద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నాము. ఈ పది సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నాము అని చైతన్య, సమంతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటన చూసిన తర్వాత అందరికి నోట మాట రాలేదంటే అతిశయోక్తి కాదు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోవల్సి వచ్చిందని జనాలు చెవులు కొరుక్కున్నారు.
Naga Chaitanya : భలే ఛాన్స్ మిస్సయిందే..!
ఇప్పుడు నాగచైతన్యకు సంబంధించిన ఓ వార్త ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. చైతు ఒకవేళ సమంతను ప్రేమించకపోతే.. ఓ పెద్దింటికి అల్లుడు అయ్యేవాడని.. అతని తండ్రి నాగార్జున సంబంధాలు కూడా చూశారని సమాచారం. అయితే నాగార్జున చూసిన సంబంధం మరేదో కాదు. బాలకృష్ణ కూతురితో తన తనయుడి వివాహం జరిపించాలని అనుకున్నాడట నాగ్. బాలయ్య, నాగార్జున మంచి మిత్రులు. అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో వియ్యంకులు అవ్వాలనుకున్నారట. నాగ్ పెద్ద కొడుకు నాగ చైతన్యతో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని వివాహం చేయాలని భావించారట. ఇరు కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చాక నాగ చైతన్య షాక్ ఇచ్చాడట.

తాను సమంతని ప్రేమిస్తున్నానని పెళ్లి ఆమెనే చేసుకుంటానని చెప్పడంతో బాలయ్య సంబంధం క్యాన్సిల్ అయిందని చెబుతున్నారు.సమంతనే చైతూ ప్రేమించి ఉండకపోతే బాలయ్య ఇంటికి అల్లుడు అయ్యేవాడు. ఆయన జాతక చక్రం మరోలా ఉండేది. అయితే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనే విషయం మనకు తెలిసిందే. ఆ క్రమంలోనే వారి వారి పెళ్లిళ్లు వేరే వారితో జరిగాయి. బాలయ్య తేజస్విని వైజాగ్ కి చెందిన విద్యాసంస్థల అధినేత భరత్ కి ఇచ్చి వివాహం చేశారు. 2013లో వారి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. ఇక దాదాపు 8 ఏళ్ళు ప్రేమించుకున్నసమంత, నాగ చైతన్య జంట 2018లో వివాహం చేసుకొని గత ఏడాది విడిపోయారు. ఇప్పుడు ఇద్దరు సోలో లైఫ్ గడుపుతున్నారు.