Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దులు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఆ తర్వాత సినిమాల్లోకి కూడా వెళ్లింది. అందులోను కలిసి రాకపోవడంతో సైలెంట్ అయింది. ఇటీవలే హైదరాబాద్ పబ్ ఇష్యూలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ట్రోల్స్ బారిన పడింది నిహారిక. అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం కాస్త తగ్గించి సినిమా నిర్మాణాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక ఈ అమ్మడు 2020 చివర్లో చైతన్య జొన్నలగడ్డని వివాహం పెళ్లి చేసుకొని అప్పటినుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
భర్తతో వెకేషన్ ట్రిప్స్ వేస్తూ ఆయా పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది. ఎప్పటికప్పుడు భర్తతో కలిసి దిగిన ఫోటోల్ని కూడా నిహారిక తన సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూనే ఉంది. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్లో ఉదయపూర్, రాజ్ మహల్ తె నిహారిక వివాహం అట్టహాసంగా జరిగింది. నాగబాబు అల్లుడు నాగచైతన్య జొన్నాల గడ్డకు భారీగా కట్న కానుకలు కూడా సమర్పించారని తెలుస్తోంది. నాగబాబు అల్లుడు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాడు అయిన నాగబాబు బాగానే ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపుగా రూ.15 కోట్ల రూపాయల వరకు కట్నం ఇచ్చినట్లుగా సమాచారం.

Niharika : నిహారికకి అంత కానుకలా?
ఇక నిహారిక ఆభరణాల కోసం రూ.3 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది.. ఇక తన కూతురి పెళ్లికి అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి చాలా ఘనంగా జరిపారు నాగబాబు. ఇక పెళ్లి రోజు నిహారికకు పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా భారీగా గిఫ్ట్లు కూడా ఇచ్చారని తెలుస్తోంది. నిహారికకు నాగబాబు ఖరీదైన ఇల్లు కూడా ప్రజంట్ చేశారని సమాచారం. అయితే నిహారిక పెళ్లి యానివర్సరీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నిహారికకి హీరోయిన్గా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో డిజిటల్, బుల్లి తెరపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది.