Nagarjuna : అక్కినేని నాగార్జున ఇటీవల పెద్దగా సక్సెస్‌లు అందుకోలేకపోతున్నారు.అయినప్పటికీ ఆయన పోరాడుతూనే ఉన్నారు. అయితే ఒకవైపు తన ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు పలు హీరోల సినిమాల వేడుకలకి హాజరై వారిని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా కార్తీ నటించిన సర్ధార్ ప్రీ రిలీజ్ వేడుకకి హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిత్వం పరంగానూ పవన్‌కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొందరైతే పవన్ కల్యాణ్ మా దేవుడు అంటూ చెప్పుకుంటారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే అటు సినిమాల్లోనూ దూసుకెళ్తున్నారు పవన్.
అక్కినేని నాగార్జున పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్తీ గురించి మాట్లాడుతూ.. అన్న ఒక సూపర్ స్టార్ అయినప్పుడు ఆ స్టార్డమ్ షాడో నుంచి పక్కకు వచ్చి స్టార్ గా ఎదిగినవాళ్లను కొందరినే చూశాను. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కర్ణాటకలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్, తమిళంలో సూర్యా తమ్ముడు కార్తీ. వీళ్లు బాగా అరుదైన నటులు” అంటూ కింగ్ నాగార్జునా చెప్పుకొచ్చాడు. అన్న స్టార్‌గా ఉన్న సమయంలో వారి ఇమేజ్ నుంచి పక్కకు వచ్చి స్టార్లుగా ఎదిగేవారు చాలా అరుదుగా ఉంటారంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.

Nagarjuna : పవ్‌పై ప్రశంసలు..
అయితే పవన్‌పై కొంతమంది వైసీపీ నాయకులు ఎంతో మందిని తొక్కి పవన్ ఈ స్థాయికి వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున .. కార్తీ మూవీ సర్థార్ వేదికగా వారికి పూర్తి క్లారిటీ ఇచ్చాడు. తప్పులు మాట్లాడితే ఊరుకోను అన్న విధంగా నాగార్జున మాట్లాడడం మెగా ఫ్యాన్స్ని ఆనందానికి గురి చేస్తుంది. ఇక సర్ధార్ విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఘనంగా విడుదల చేస్తున్నాడు..ఈ నెల 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదల అవ్వబోతుంది. ఒక స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా తీసుకొస్తున్నారు.