Nagarjuna : వెన్నెల కిశోర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున .. కోడలు తో ‘ ఆ మ్యాటర్ ‘ లో !

Advertisement

Nagarjuna : టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నారు వెన్నెల కిశోర్. ఆయన కామెడీ టైమింగ్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈమధ్య వరుస సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్నారు వెన్నెల కిశోర్. అయితే అలాంటి వెన్నెల కిశోర్ కి నాగార్జున వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కింగ్ నాగార్జున ఏంటి వెన్నెల కిశోర్ కి వార్నింగ్ ఇవ్వడం ఏంటని అనుకోవచ్చు. ఇది బంగార్రాజు సినిమా టైం లో జరిగిన విషయం అని తెలుస్తుంది.

Advertisement

సినిమాలో వెన్నెల కిశోర్ హీరోయిన్ కృతి శెట్టితో చాలా సీన్స్ లో నటించారు. అయితే ఆ టైం లో కృతి శెట్టిని తన కామెడీతో మెప్పించాలని అనుకున్నారట వెన్నెల కిశోర్. ఆమె మీద కామెంట్స్ చేస్తూ కామెడీ చేశారట. అయితే కృతి శెట్టికి అది నచ్చలేదట. డైరెక్ట్ గా అతనితో చెప్పకుండా ఆ సినిమా హీరో నాగార్జునతో తన బాధ పంచుకుందట కృతి శెట్టి. నాగార్జున వెన్నెల కిశోర్ కి అర్ధమయ్యేలా చెప్పారట. ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చిన అమ్మాయి.. ఆమె మీద అలాంటి జోక్స్ తీసుకోలేదు అయినా అమ్మాయిల మీద అలాంటి జోక్స్ ఎంటయ్యా అని అన్నారట. ఇంకోసారి ఇలాంటి జోక్స్ వేశావంటే రెమ్యునరేషన్ కట్ చేస్తానని.. నా కోదలు పిల్లకు దూరంగా ఉండమని చెప్పారట నాగార్జున.

Advertisement
nagarjuna gave a serious-warning to vennela kishore
nagarjuna gave a serious-warning to vennela kishore

ఇంతకీ నాగార్జున ఎందుకు కృతి శెట్టిని కోడలు పిల్లా అన్నారు అంటే.. బంగార్రాజు సినిమాలో నాగ చైతన్యకి భార్యగా నాగార్జున కోడలిగా కృతి శెట్టి నటించింది. అందుకే వెన్నెల కిశోర్ కి నా కోడలికి దూరంగా ఉండమని చెప్పారట. మొత్తానికి అలా వెన్నెల కిశోర్ కి నాగ్ నుంచి ఫస్ట్ షాక్ తగిలింది. అయితే కృతి శెట్టి అపార్ధం చేసుకుందేమో కానీ వెన్నెల కిశోర్ హీరోయిన్స్ ని నవ్వించే ప్రయత్నంలోనే కొన్ని జోక్స్ చేస్తారే తప్ప ఆయన ఉద్దేశ్యం అది కాదని అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ కమెడియన్స్ లో వెన్నెల కిశోర్ ఒకరు. ఈమధ్య ఆయన లేని సినిమా కనిపించట్లేదని చెప్పొచ్చు. స్టార్ హీరో సినిమానే కాదు యువ హీరోల సినిమాల్లో కూడా ఆయన నటిస్తూ మెప్పిస్తున్నారు.

Advertisement