Nagarjuna : ఒకప్పుడు వెండితెరపై సంచలనాలు క్రియేట్ చేసిన స్టార్స్‌లో నాగార్జున, చిరంజీవి తప్పక ఉంటారు. వారు చేసిన సినిమాలకు బాక్సాఫీస్ బద్దలైంది. ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా వారు సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు హీరోలకి పెద్దగా సక్సెస్‌లు అనేవి రావడం లేదు. అయినప్పటికీ పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. అయితే నాగార్జున కన్నా చిరంజీవికి కాస్త పాపులారిటీ ఉండడంతో పాటు ఆయన చేసే సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో చిరంజీవితో పోటీగా సినిమాలు విడుదల చేయడానికి కొందరు ఆలోచిస్తుంటారు. కాని నాగార్జున మాత్రం చిరుతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది.
కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమా షూటింగ్ చాన్నాళ్లుగా జరుపుకుంటుంది. ఎట్టకేలకు `ది ఘోస్ట్` చిత్రాన్ని పండుక్కి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ది ఘోస్ట్` దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది వాయిదా పడుతుందని పండుగకు రాకపోవచ్చు అని కొందరు ప్రచారాలు చేశారు. కానీ అందుతున్న సమాచారం మేరకు సినిమాని వాయిదా వేయడం లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబర్ 5నే విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగా డిసైడ్ అయిందట.

Nagarjuna : ఆసక్తికర ఫైట్…
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తుంది. చిత్రానికి సంబంధించి కొన్ని ప్రచార చిత్రాలు విడుదల కాగా,ఇవి సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ మూవీ నాగార్జునకి పెద్ద హిట్ ఇవ్వడం ఖాయం అని కొందరు అంటున్నారు. అయితే ఇందులో నాగార్జున రా అనే పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన పాత్ర సరికొత్తగా ఉండనుండగా, ఇది ప్రేక్షకులకి చాలా థ్రిల్ కలిగస్తుందని చెబుతున్నారు. అయితే ది ఘోస్ట్ చిత్రం చిరంజీవి గాడ్ ఫాదర్‌కి పోటీగా విడుదల కానుందని తాజా సమాచారం. అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ ప్లాన్ చేస్తుండగా, అదే రోజు నాగ్ `ది ఘోస్ట్` కూడా రిలీజ్ కాబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు బిగ్ స్టార్స్ పోటీ పడుబోతుండటంతో దసరా బరి మంచి ఇంట్రెస్టింగ్గా ఉండడం ఖాయం అని కొందరు చెబుతున్నారు.