Nagarjuna : అక్కినేని నాగ చైతన్య- సమంత విడిపోయి ఏడాది అయింది. ఇంక వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరు కలిసిపోతే చూడాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల సమంత ఓ పోస్ట్ పెట్టగా, దాంతో చాలా మంది వీరిద్దరు కలవబోతున్నారని పుకార్లు పుట్టించారు. గతంలో సామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి విడాకుల ప్రకటనను తొలగించింది. రీసెంట్గా సామ్ టీషర్ట్ ధరించి సెల్ఫీ దిగింది. అక్కడ తన ఫేస్ కనిపించకుండా, కేవలం టీ షర్ట్ రాసి ఉన్న ‘యూ విల్ నెవర్ వాక్ ఎలోన్’ అనే కోట్ని హైలెట్ చేసింది. దీంతో అనుమానుల బలపడుతున్నాయి. అది లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ సేయింగ్ అయినప్పటికీ సామ్ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
సమంత మరియు నాగ చైతన్య కలిసి నటించిన ‘మజిలీ’ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇది..అలాంటి సినిమాకి సీక్వెల్ ని నిర్మించడానికి అక్కినేని నాగార్జున సన్నాహాలు చేస్తున్నాడట..అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇందులో నాగ చైతన్యనే హీరోగా తీసుకున్నప్పటికి హీరోయిన్గా సమంతని తీసుకోవాలని నాగ్ భావిస్తున్నాడట. మరి ఈ సినిమా కోసం సమంత ఒప్పుకుంటుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.

Nagarjuna : ఏం చేస్తాడో మరి..
సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య కలిసి ‘ఏమాయ చేశావే’ సినిమా చేశారు. అప్పుడే ఆమెకు మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఈ సినీ జంట వివాహం చేసుకుంది. 2017లో వీరు పెళ్లి చేసుకోగా అక్టోబర్ 2, 2021న విడాకులు తీసుకున్నారు.