Geetu Royal : బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు. కంటెస్టెంట్స్ కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అంటే వారికి తగ్గట్టే హొస్ట్, నిర్వాహకులు కూడా ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఇనయ, సూర్యల మధ్య వ్యవహారం పీక్స్‌లోకి వెళ్లడంతో నాగార్జున కాస్త మందలిస్తాడని అనుకుంటుంటే ఆయన మాత్రం పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇనయని ఇప్పటి వరకూ ఎవరూ పొగడనంతా తెగ పొగిడేశారు. ఆమె గేమ్ ఏం చూశారో ఏమో కానీ.. ‘ఇనయ కంప్లీట్ ప్యాకేజ్’ అనేశారు. ఆ తరువాత ఆమె క్రష్ గురించి మాట్లాడారు. మొత్తానికి నాగ్ కూడా ఇనయ పాట పాడడంతో ఈ అమ్మడి క్రేజ్ పీక్స్ లోకి వెళ్లింది. కొద్ది రోజుల క్రితం రెండు వారాలకే బయటకు వస్తుందని అందరు అనుకున్నారు.
కాని సమయానికి తగ్గట్టు తాను మారిపోయి మిగతా వారికి గట్టి కాంపిటీటర్‌గా మారిపోతుంది. ప్రస్తుతం హౌస్‌లో చాలామంది తినిపడుకునే బ్యాచ్‌లు ఎక్కువ ఉండగా.. ఇనయ మాత్రం సింగిల్‌గానే గేమ్ ఆడుతుంది. ఇంకా చెప్పాలంటే.. గీతు తరువాత హౌస్‌లో అమ్మాయిలు అందరిలోనూ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తోంది ఇనయ. నోరు పారేసుకుంటుంది.. అరుస్తుంది అన్న మాటే కానీ.. హౌస్‌లో ఉన్న సోది బ్యాచ్లకంటే ఇనయ చాలా బెటర్.ఇటీవల ఓ ఎపిసోడ్లో అయితే.. శ్రీహాన్‌కి చెమటలు పట్టించింది ఇనయ. చివరి వారం ఇనయ ఎలిమినేషన్ లో ఉండగా, చంటి కన్నా ఇనయనే ముందు వెళుతుందని అనుకున్నారు. సేఫ్ అయి అందరిని ఆశ్చర్యపరచింది. ఈ అమ్మడి యవారం చూసి మిగతా వారు షాక్ అవుతున్నారు. గీతూ అయితే ఎన్నో ఎత్తులు వేస్తూ గేమ్ ఆడుతున్నాడా ఆదరణ దక్కడం లేదు.

Geetu Royal : పాపం గీతూ…
దీంతో కుళ్లిపోతుంది. ఇక హౌజ్‌లో అర్జున్ కళ్యాణ్- శ్రీ సత్యలను కూడా గబ్బు పనుల్లో దూసుకునిపోండయ్యా అన్నట్టుగా తెగ ఎంకరేజ్ చేశారు నాగార్జున. హిట్టు.. ఫ్లాప్ పంచాయితీలో ఆదిరెడ్డిని.. గీతుని ఎదురెదురుగా నిలబెట్టి ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ చెప్పాలని నాగార్జున అనడంతో.. గీతు పాప ఓపెన్ అయ్యింది. ‘నేను అన్ని విషయాల్లో ఈక్వల్ కానీ.. నా దగ్గర ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది.. ఆదిగారి దగ్గర ఎంటర్ టైన్మెంట్ ఉండదు’ అని అన్నది. దీంతో ఆదిరెడ్డి.. ఇది ఎంటర్ టైన్మెంట్ షో కాదు.. బిగ్ బాస్ షో అని చురక వేయగా.. ‘బిగ్ బాస్ సీజన్ 6 అంటే ఎంటర్ టైన్మెంట్కి అడ్డా ఫిక్స్’ అంటూ గట్టిగా ఇచ్చింది గీతూ. మొత్తానికి హౌజ్‌లో ఎవరు ఏం చేస్తున్నారో, ఎప్పుడు ఎలా మారుతున్నారో.. ఎవరు ఫ్రెండ్స్,. ఎవరు ఎనిమీస్ అన్నది ఎవరికి అర్ధం కావడం లేదు.