Nagarjuna : ఒకప్పుడు వెండితెరని ఏలిన హీరోలు ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు. మినిమం సక్సెస్ అందుకునేందుకు కూడా తెగ కృషి చేస్తున్నారు. నాగార్జున విషయానికి వస్తే ఒకప్పుడు ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ఈ మధ్య నాగ్ చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి.ఆయన.. హిట్లు ఫ్లాపులను బేరీజు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే నాగార్జున ఇటీవలే ‘ది ఘోస్ట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి కలెక్షన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా చేసింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్లో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ అయింది. అయితే ఈ సినిమాకి ఆశించిన ఆదరణ అయితే రావడం లేదు. ఫలితంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఇదే కంటిన్యూ అవుతూ 10వ రోజు కూడా ఈ చిత్రం రెండు కేవలం రూ. 4 లక్షలు మాత్రమే రాబట్టింది.

Nagarjuna : నాగ్ పరిస్థితి దారుణం..
ఈ లెక్కలు చూస్తుంటే ఓవరాల్‌గా నాగార్జునను జనాలు పట్టించుకోవడం మానేశారు. ఇప్పటకీ అయినా తన వయస్సుకు తగ్గ పాత్రలు చేసుకోకుండా ది ఘోస్ట్, ఆఫీసర్, మన్మథుడు 2 అంటూ ముసలి వయస్సులో ఈ వేషాలు వేస్తే ఎవరు మాత్రం చూస్తారు అంటూ కొందరు చురకలు అంటిస్తున్నారు.. బాలయ్య, వెంకటేష్‌లా వైవిధ్యమైన పాత్రలు వేస్తేనే బాగుంటుంది. లేదంటే సినిమాలకి గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.