Bigg Boss 6 Telugu : మొత్తానికి నాగార్జున కొంప ముంచిన శ్రీ సత్య .. మామూలు అరాచకం కాదు ఇది !

Advertisement

Bigg Boss 6 Telugu : స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఏడో వారం పూర్తిచేసుకుంది. వీకెండ్ కావడంతో హొస్ట్ నాగార్జున రంగంలోకి దిగాడు. ఈవారంలో జరిగిన కీలక పరిణామాలు మరియు ఇంటి సభ్యుల పట్ల ఆయన రియాక్షన్ అలా ఉంటుందో , అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఏకంగా కెప్టెన్సీ టాస్క్ ను రద్దు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు కఠిన పరీక్షలను పెడుతున్నారు. ఫుడ్ లేకుండా అందరి కడుపులను మడ్చాడు . సర్వైవల్ టాస్క్ తో ఇంటి సభ్యుల మధ్య మంట పెట్టాడు. ఇక ఈ వారం మొత్తం ఇలా సాగింది.ఇక ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విడగొట్టి బిగ్ బాస్ సర్వైవల్ టాస్క్ ను ఆడించింది. ఈ టాస్క్ లో భాగంగా చిన్న రంద్రం నుండి పూలు బొమ్మలు వస్తుంటాయి.వీటిని రెండు టీం సభ్యులు సేకరించాలి.

Advertisement

ఏ టీం అయితే ఎక్కువ సేకరిస్తుందో ఆ టీం విజేతగా నిలుస్తుంది. అయితే ఈ గేమ్ లో శ్రీ సత్య టీం ఓడిపోయంది . గేమ్ రూల్స్ ప్రకారం ఓడిపోయిన టీం నుండి ఒకరు నామినేట్ అవుతారు. ఇక ఒక్కరు ఎవరనేది ఆ టీమ్ మెంబర్స్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీంతో అందరూ బాగా ఆడారు ఒకరిని కార్నర్ చేయడం ఎందుకని శ్రీ సత్య చిట్టిలు రాసి ఎవరి పేరు వస్తే వాళ్లు నామినేట్ అవుతారని చెప్పింది. టీం సభ్యుల పేర్లు అన్ని చిట్టీల మీద రాసి ఒక జాడీలో వేశారు. మరో టీం కి చెందిన ఫైమాను పిలిచి ఒక చిట్టి తీయమని కోరగా… ఫైమా తీసిన చిట్టిలో శ్రీ సత్య పేరు వచ్చింది. దాంతో శ్రీ సత్య నేరుగా నామినేట్ అయ్యారు. దీంతో శ్రీ సత్య చిట్టిల గేమ్ ను రద్దుచేసి మళ్ళీ నామినేషన్స్ ను నిర్వహించింది. ఎవరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారే చెప్పాలి అని చెప్పింది. దీంతో అధిక ఓట్లు వాసంకి రాగా ఆమె నామినేట్ అయింది.

Advertisement
Nagarjuna's horn dipped Shri Satya .. This is not an ordinary anarchy!
Nagarjuna’s horn dipped Shri Satya .. This is not an ordinary anarchy!

ఇక ఈ విషయాన్ని హొస్ట్ నాగార్జున చిట్టీలు ఆడినప్పుడు శ్రీ సత్య పేరు వచ్చింది కదా.. దాన్ని రద్దు చేసి మళ్లీ నామినేషన్స్ పెట్టడం కరెక్టేనా అని అడిగారు. దానికి శ్రీ సత్య వివరణ ఇస్తూ మేము ఎంటర్టైన్మెంట్ టాస్క్ సరిగా ఆడలేదు. ఇక మీరు ఈ వారం మమ్మల్ని బాగా తిడతారని డిసైడ్ అయ్యాం సార్. అందుకే చిట్టీలతో నామినేషన్ నిర్ణయిస్తే మీరు ఏమంటారో అని మార్చాను సార్ అని చెప్పింది. దానికి నాగర్జున ఈ నేరం ను నా మీద నెట్టేసారా అని ఆశ్చర్యపోయాడు. ఇక ఈవారం మొత్తం 13 మంది సభ్యులు నామినేషన్ కావాల్సి ఉంది. దీంతో ఎవరు హౌస్ ను వదిలేసి వెళ్తారు అనే ఉత్కంఠత సాగుతోంది.

Advertisement