Nandamuri Mokshajna : నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ వర్సెస్ టిడిపిగా విడిపోయిన నేపథ్యంలో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ను ఎలాగైనా సరే స్టార్ హీరో ను చేయాలని అంటున్నారు. మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయండి మిగతాది మేము చూసుకుంటామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక దీంతో బాబు మరియు బాలయ్య వర్గం జూనియర్ ని దెబ్బతీయవచ్చు అని అనుకుంటున్నారు.ఈ క్రమంలో వేణు స్వామి చెప్పిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
వేణు స్వామి సెలబ్రిటీల పుట్టినరోజు ఆధారంగా వారి జాతకాలను చెబుతుంటాడు. ఇక ఆయన చెప్పినవి చాలా వరకు నిజాలు కూడా అయ్యాయి.సమంత చైతు విడాకుల్ని కూడా ముందుగానే అంచనా వేశాడు వేణుస్వామి. ఇక తాజాగా వేణు స్వామి మోక్షజ్ఞ యొక్క సినీ మరియు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని జాతకం ద్వారా తెలియజేశారు. దీనిలో భాగంగా మోక్షజ్ఞ జాతకం ప్రకారం అతడు సినిమాల్లో బాగా రాణిస్తాడని స్టార్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పాడు వేణు స్వామి. అయితే చాలామంది అభిమానులు ఆయన ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి రావాలని సీఎం కూర్చి ఎక్కాలని కోరుకుంటున్నారు. అయితే అభిమానుల కోరిక తీరదని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.

మోక్షజ్ఞ జాతకం ప్రకారం అతనికి రాజకీయ భవిష్యత్తు లేదట. అలాగే రాజకీయాలలో అతను చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకోలేడని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. ఇదే నిజమైతే చాలామంది అభిమానులకు నిరాశ తప్పదు . మరోవైపు మోక్షజ్ఞకు అసలు హీరో అవ్వాలని ఆలోచన లేదట. అందుకే 30 ఏళ్లు వస్తున్న ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఇక ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ వస్తుంది అన్న వార్తలు పుకార్లు గానే మిగిలిపోతున్నాయి. ఇక తను హీరో అయ్యే అవకాశాలు కూడా తక్కువే అని పుకార్లు వస్తున్నాయి.ఇక ఇది నందమూరి అభిమానులకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.