Unstoppable 2 : ఆహా ఓటీటీ గురించి తెలుసు కదా. అది తెలుగు బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ది. అయితే.. ఆహా ఓటీటీకి ముందు అంత ఆదరణ లేదు కానీ.. ఎప్పుడైతే అన్ స్టాపబుల్ షో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ షోతో పాటు ఓటీటీకి వస్తున్న ఆదరణ కూడా మామూలుగా లేదు. అన్ స్టాపబుల్ సీజన్ వన్ సూపర్ సక్సెస్ కావడంతో పాటు ఆహా ప్లాట్ ఫామ్ కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కేవలం అన్ స్టాపబుల్ షోను చూడటం కోసమే కొన్ని వేల మంది, లక్షల మంది ఆహా సబ్ స్క్రిప్షన్ ను తీసుకున్నారు. అందులో ఎక్కువగా బాలయ్య బాబు అభిమానులే ఉన్నారు. దానికి కారణం.. అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా ఉన్నది ఎవరో కాదు.. లెజెండ్ నందమూరి బాలకృష్ణ.
అసలు వేదికల మీద సరిగ్గా మాట్లాడటం కూడా రాని బాలయ్యతో టాక్ షో ఎలా సాధ్యం అని అందరూ పెదవి విరిచారు. కానీ. ఆ షోను చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. బాలయ్య బాబులో మరో కోణం అది. బాలయ్య బాబులో ఇంత టాలెంట్ ఉందా అని మురిసిపోయారు. ఆక్షన్ వాక్చాతుర్యం, హాస్య చతురతను చూసి అబ్బురపడిపోయారు. అందుకే సీజన్ వన్ సూపర్ సక్సెస్ అయింది. సీజన్ వన్ సూపర్ సక్సెస్ తో వెంటనే సీజన్ 2 ను కూడా ఇటీవలే ప్రారంభించారు.

Unstoppable 2 : రెండో సీజన్ కు మరింత ఉత్సాహంతో చెలరేగిపోతున్న బాలయ్య
రెండో సీజన్ లో తొలి ఎపిసోడ్ లోనే ఇద్దరు బడా రాజకీయ నాయకులను పిలిచారు బాలయ్య. ఒకరు నారా చంద్రబాబునాయుడు కాగా, మరొకరు ఆయన కొడుకు నారా లోకేశ్. మొదటి ఎపిసోడే సూపర్ సక్సెస్ అయింది. ఈ షోను బాలయ్య ఇంకో లేవల్ కు తీసుకెళ్తున్నాడని అల్లు అరవింద్ కూడా చాలా ఖుషీ అయ్యారట. అందుకే బాలయ్యకు ఇంకొంచెం ఎక్కువ పారితోషికం ఇద్దామని భావించి ఇదే విషయం బాలకృష్ణకు చెప్పారట అల్లు అరవింద్. దీంతో తనకు ఎక్కువ పారితోషికం వద్దని, ఇదివరకు ఎంత ఇచ్చారో అంతే ఇవ్వాలని చెప్పారట. పైగా తన విలువలకు అది విరుద్ధం అని చెప్పారట. బాలయ్య బాబు ఎంత పెద్ద మనసుతో పారితోషికం పెంచుతామన్నా వద్దన్నారు అని అరవింద్ అబ్బురపడ్డారట. బాలయ్య బాబు వద్దన్నా సరే.. ఆయనకు పెంచాలని అనుకున్న పారితోషికాన్ని బసవతారకం ఆసుపత్రికి విరాళంగా పంపించారట అరవింద్. అది అసలు సంగతి.